శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Feb 16, 2020 , 03:17:54

పేదింటి పెండ్లి పెద్ద సీఎం కేసీఆర్‌

పేదింటి పెండ్లి పెద్ద సీఎం కేసీఆర్‌

రాయపర్తి, ఫిబ్రవరి 15 : పేదింటి పెండ్లిళ్లకు సీఎం కేసీఆర్‌ పెద్ద అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కిష్టాపురం క్రాస్‌ రోడ్డు సమీపంలోని వీఆర్‌ గార్డెన్స్‌లో మహబూబ్‌నగర్‌ గ్రామానికి చెందిన పెండ్లి కొమురారెడ్డి కుమారుడి వివాహమహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో రాష్ట్రంలోని ఆడబిడ్డల వివాహాలు జరుగుతున్నట్లు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న ‘కల్యాణ’ పథకాలు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు సర్కారు అందిస్తున్న కానుకలు అని వివరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ నేతృత్వంలో సమకూర్చిన కానుకలను అందించి దీవించారు. ఏసీరెడ్డి సంతోశ్‌కుమార్‌, తోట సోమనర్సయ్య పాల్గొన్నారు. 

మంత్రి ఎర్రబెల్లిని కలిసిన పీఏసీఎస్‌ డైరెక్టర్లు

 పర్వతగిరి, ఫిబ్రవరి 15 : పర్వతగిరి పీఏసీఎస్‌ డైరెక్టర్లు శనివారం రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్లుగా ధ్రువీకరణ పత్రాలను అందుకున్న అనంతరం నేరుగా పర్వతగిరిలోని మంత్రి స్వగృహానికి చేరుకుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆశీస్సులను అందుకున్నారు. పర్వతగిరి పీఏసీఎస్‌ చైర్మన్‌ అభ్యర్థి మోటపోతుల మనోజ్‌కుమార్‌గౌడ్‌తో పాటు డైరెక్టర్ల బృందం మంత్రి దయాకర్‌రావుకు పుష్పగుచ్ఛం అందజేసింది. డైరెక్టర్లను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మేడిశెట్టి రాములు, ఏడుదొడ్ల జితేందర్‌రెడ్డి, చింతపట్ల సోమేశ్వర్‌రావు, రంగు కుమార్‌గౌడ్‌, లునావత్‌ పంతులు, నవీన్‌కుమార్‌, జడల కృష్ణ, ఈరగాని సాంబయ్య, బొట్ల మధు, కుమారస్వామి, లక్ష్మీబాయి, డైరెక్టర్లు పాల్గొన్నారు.