నందకిశోర్, సిరి హనుమంతు జంటగా నటిస్తున్న చిత్రం ‘నరసింహపురం’. శ్రీరాజ్ బళ్లా దర్శకుడు. టి. ఫణిరాజ్గౌడ్, నందకిశోర్ ధూళిపాల నిర్మాతలు. ఈ చిత్ర టీజర్‌ను అగ్ర హీరో వెంకటేష్ విడుదలచేశారు. ఆయన మాట్లాడుతూ ‘టీజర్ బాగుంది. హీరోగా నందకిశోర్‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి’ అని తెలిపారు. ‘అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నరసింహపురంలో ఏం జరిగింది? తన చెల్లెలికి జరిగిన అన్యాయంపై ఓ అన్నయ్య ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది ఆకట్టుకుంటుంది. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. నందకిశోర్ పాత్ర భిన్న పార్శాలతో సాగుతుంది’ అని దర్శకుడు పేర్కొన్నారు.