రైతును రాజు చేయడమే సీఎం లక్ష్యం

రాయపర్తి, ఫిబ్రవరి 14: రాష్ట్రంలోని రైతాంగాన్ని రారాజులు చేయాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన సంకల్పమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సహకార ఎన్నికలపై శుక్రవారం మండలంలోని కొలన్‌పల్లి, రాయపర్తి గ్రామాల్లో పార్టీ శ్రేణులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని వ్యవసాయరంగాన్ని పట్టించుకోకపోవడంతో ఇక్కడి భూములన్ని పడావుపడి రైతులంతా పొట్టకూటికోసం వలస వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల ఆదరణ లేక ఆనాడు వ్యవసాయం దండుగనే నానుడి ప్రజల్లో బలీయంగా నాటుకుపోయిందన్నారు. తెలంగాణ ప్రాంత రైతుల బతుకు మార్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా, సమృద్ధిగా సాగుజలాల సరఫరా, నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూ ముఖ్యమంత్రి అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు. రైతాంగ సంక్షేమాన్ని కోరుకునే గులాబీ జెండానే అన్నివర్గాల ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకోవాలని కోరారు. వ్యవసాయరంగ సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న టీఆర్ఎస్ పార్టీకి రైతులను ఓట్లడిగే హక్కు ఉందన్నా రు. ఎన్నికల సమయంలో గ్రామీణప్రాంతాలకు వచ్చి ప్రజలను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాలకు రైతులు ఓటుతో బుద్ధిచెప్పాలని ఆయన కోరారు. తెలంగాణలో మట్టిపనికైనా మనోడు ఉండాలనే నానుడిని ఈ ఎన్నికల్లో ప్రజలు నిజం చేస్తే భవిష్యత్‌లో సహకార సంఘాల్లో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలతో చరిత్ర సృష్టిస్తుందన్నారు. అనంతరం రాయపర్తి, కొలన్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, మండల ఎన్నికల ఇన్చార్జి ఈదూరి ఐలయ్య, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, నాయకులు బిల్లా సుధీర్‌రెడ్డి, యాకనారాయణ, నర్సయ్య, ఉస్మాన్, వనజారాణి, రవీందర్రావు, మధు, సుధాకర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎలుక మూతి ఆకారంలో చేప.. ఎక్కడో తెలుసా?
- సంప్రదాయానికి స్వస్తి.. తైవాన్ జామతో దోస్తీ..!
- ప్రభాస్‌తో ఢీ అనేందుకు సిద్ధమైన తమిళ హీరో
- కబడ్డీ.. కబడ్డీ.. అదరగొట్టెన్ అదనపు కలెక్టర్
- కాలినడకన తిరుమల కొండెక్కిన జబర్దస్త్ నటుడు
- అన్నాహజారేతో మహారాష్ట్ర మాజీ సీఎం భేటీ
- క్యారెక్టర్ ఎమోజీ పొందిన తొలి భారతీయ నటి సమంత !
- ఈత చెట్టుపై వాలి.. కల్లు తాగిన చిలుక
- రేపు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష
- భారత్ ‘నిజమైన స్నేహితుడు’ : అమెరికా