ఆదివారం 17 జనవరి 2021
Warangal-rural - Feb 14, 2020 , 04:28:13

సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పోటీ లేదు

సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పోటీ లేదు

పరకాల టౌన్‌, ఫిబ్రవరి 13 : సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పోటీ లేదని, నియోజకవర్గంలోని అన్ని సొసైటీలను టీఆర్‌ఎస్‌ కైవశం చేసుకుంటుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో పరకాల, మాధారం సొసైటీల పరిధిలోని ముఖ్యకార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భాంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గంలో ఉన్న మొత్తం 12సొసైటీలలో ఆత్మకూరు మండలం పెంచికలపేట, గీసుకొండ మండలం మొగిలిచర్ల సొసైటీలను ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుందన్నారు. మిగిలిన సొసైటీలు కూడా టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడనున్నాయని, టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థుల గెలుపు ఖాయమన్నారు. ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసిన ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతారని  ఇందుకు ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికలే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ అనునిత్యం కృషి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని అన్నారు. కొదరు తమ ఉనికిని చాటుకునేందుకు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని దుష్ప్రచారాలు చేసిన ప్రజలు నమ్మరన్నారు.. ప్రతిపకాలకు  రైతుల వద్ద ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సిలివేరు మొగిలి, ఎంపీపీ తక్కళపల్లి స్వర్ణలత రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డీనేటర్‌ బొల్లె భిక్షపతి, జిల్లా సభ్యుడు చింతిరెడ్డి సాంబరెడ్డి, నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, బొజ్జం రమేశ్‌, గురి.పల్లి ప్రకాశ్‌ రావు, నందికొండ జైపాల్‌ రెడ్డి  పాల్గొన్నారు.