బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Feb 13, 2020 , 04:25:04

నేడు కాళేశ్వరానికి జల సాధకుడు

నేడు కాళేశ్వరానికి జల సాధకుడు

ఉదయం 10.30 గంటలకు సీఎం రాక కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు గోదావరికి చీరె సారెలు సమర్పించనున్న కేసీఆర్‌ లక్ష్మీ బరాజ్‌ సందర్శన మేడిగడ్డలో సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు సంబంధిత ఇరిగేషన్‌ అధికారులతో రివ్యూ మీటింగ్‌ సుమారు 3.30 గంటలపాటు అక్కడే..

మహదేవపూర్‌/కాళేశ్వరం/భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 12: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టా త్మకంగా తీసుకుని చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను మరోసారి సీఎం కేసీఆర్‌ సందర్శించనున్నారు. ముందు గా కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దర్శనం అనంతరం ఆయన గోదావరి నదికి చీర సారెలు సమర్పించ ను న్నారు. కరీంనగర్‌ నుంచి ఉదయం 9 గం.లకు బయలుదేరి ఆయన నేరుగా కాళేశ్వరానికి చేరుకుంటా రు. ఇక్కడ ముఖ్యమంత్రికి దేవస్థానం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం స్వామి వారి దర్శనం చేసుకోనున్నారు. ఇదిలా ఉండగా 2016 మే 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుకు పునాది రాయివేశారు. అనంతరం ఆయన కాళేశ్వరం దేవస్థానానికి రూ.25 కోట్లు నిధులు ప్రకటించారు. రెండోసారి మే 19వ తేదీన 2019లో మరోసారి దర్శించుకుని కాళేశ్వరంను ఒక మోడల్‌ సిటీగా తీర్చిదిద్దాలన్న సకల్పంతో రూ.100 కోట్లు నిధులు ప్రకటించారు. ఆ నిధులతోనే ఇప్పుడు కాళేశ్వ రం రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుకున్నవిధంగా ఇప్పుడిప్పుడే కాళేశ్వరం తుది దశకు చేరుకున్న క్రమంలో ఆయన పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకో బోతుంది. తెలంగాణకే వరప్రదాయనిగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు గుండెకాయగా పేరుగాంచిన లక్ష్మీ బరాజ్‌ నిండుకుండగా దర్శనమిస్తుండగా కనులారా వీక్షించడానికి సీఎం వస్తున్నారు. 


ఇదివరకే మేడిగడ్డ బరాజ్‌ నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్‌ వరకు 19 కిలోమీటర్ల పొడవునా నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ఎన్నో రికార్డులను తిరగరాస్తూ శరవేగంగా పనులు కొనసాగిన తీరు విదితమే. తెలంగాణ ప్రభు త్వ చిత్తశుద్ది, సీఎం కేసీఆర్‌ పట్టుదల, ఇంజినీరు అధికారుల అంకితభావం వెరసి లక్ష్మీ బరాజ్‌ పనులు యుద్ధప్రాతిపదికన  కొనసాగాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 2019 జూన్‌ 21న లక్ష్మీ బరాజ్‌ను సీఎం కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్‌ల వంటి అతిరథ మహారథుల సమక్షంలో ప్రారంభించారు. ఈ క్రమంలో ఆగస్టు 6వ తేదీన రాగా రెండోసారి గురువారం సీఎం కేసీఆర్‌ సందర్శనకు వస్తున్నారు. వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టుకుని యావత్తు తెలంగాణ రైతాంగానికి మేడిగడ్డ ఫలాలు అందించాలని ఉద్దేశంతో రూ. 2930 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన లక్ష్మీ బరాజ్‌లో 16.17 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించగా ఇప్పటి కే సుమారు 14 టీఎంసీల మేర నీటి ప్రవాహం చేరుకోగా మరి కొన్ని రోజుల్లో పూర్తి సామర్థ్యాన్ని చేరుకోనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ లక్ష్మీ బరాజ్‌ను సందర్శించి సంబంధిత ఇరిగేషన్‌ అధికారు లతో దిశానిర్దేశం చేయనున్నారు.జలశోభితంగా మారిన లక్ష్మీ బరాజ్‌ 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్‌ జలశోభితంగా దర్శనమిస్తుంది.బరాజ్‌లోని 85 గేట్లను మూసివేయడంతో పాటు ఎగువ నుంచి వస్తున్న గోదావరి నీరు లక్ష్మీ బరాజ్‌లో వచ్చి చేరుతుండ డంతో నిండుకుండలా కనిపిస్తోంది. లక్ష్మీ బరాజ్‌ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు,100 మీటర్ల పొడ వు కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి ప్రవాహం వచ్చి చేరుతుండడంతో పూర్తి సామర్థ్యం చేరుకు నే దిశగా ప్రవాహం వచ్చి చేరుతోంది. బుధవారం 13.982 టీఎంసీల నీటి నిల్వ ఉండగా 99.300 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతుంది.దీంతో ఎప్పటికప్పుడూ ఇంజినీరు అధికారులు సీఎం కేసీఆర్‌ కు లక్ష్మీ బరాజ్‌ స్థితిగతులను సమాచారం చేరవేస్తుండగా గురువారం 13న బరాజ్‌ సందర్శనకు వచ్చేం దుకు సీఎం నిర్ణయించుకున్నారు. 


బరాజ్‌లో 3.30 గంటలపాటు సీఎం 

లక్ష్మీ బరాజ్‌ను 3.30 గంటలపాటు సీఎం కేసీఆర్‌ సందర్శించనున్నారు. కాళేశ్వరం నుంచి 10.10 నిమి షాలకు హెలికాప్టర్‌ ద్వారా లక్ష్మీ బరాజ్‌ వద్దకు చేరుకోనున్న సీఎం కేసీఆర్‌ 10.30 సమయంలో లక్ష్మీ బరాజ్‌ వద్దకు చేరుకోనున్నారు. ఆ తర్వాత రెండున్నర గంటల పాటు బరాజ్‌ను సందర్శించి అక్కడి స్థితి గతులను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి వంతెన మీదకు చేరుకుని గోదావరి మాతకు పూజలు నిర్వ హించనున్నారు. 

తదనంతరం మధ్యాహ్నం 1.00కి ఎల్‌అండ్‌టీ కార్యాలయం చేరుకుని లంచ్‌ చేయను న్నారు. సుమారు గంట పాటు లక్ష్మీ బరాజ్‌పై ఇంజినీరు, కంపెనీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించి పలు సూచనలు అందించనున్నారు. బరాజ్‌పై రాబోయే కాలంలో అనుసరించాల్సిన ప్రణాళికల పట్ల అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం. 


కేసీఆర్‌ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న లక్ష్మీ బరాజ్‌ను సందర్శనకు సీఎం కేసీఆర్‌ ఆకస్మిక పర్యటన ఖరారు కావడంతో అధికారులు ఏర్పాట్ల పనులను షురూ చేశారు. వ్యూ పాయింట్‌ వద్ద టెంట్లు, చదును తోపాటు హెలిప్యాడ్‌ వద్ద పనులు చేపడుతున్నారు. అలాగే లక్ష్మీ బరాజ్‌లో  పోలీసులు హైఅలెర్ట్‌ ప్రక టించారు. మండలంలోని అంబట్‌పల్లి పరిధిలో నిర్మిస్తున్న లక్ష్మీ బరాజ్‌ని భద్రతా బలగాలు తమ ఆధీ నంలోకి తీసుకుని భద్రత చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి పోలీసు ఉన్నతా ధికారులు అక్కడికి వెళ్లి సీఎం భద్రత అధికారులతో చర్చించారు. బరాజ్‌ వద్ద గల హెలిప్యాడ్‌ను బాం బ్‌స్కాడ్‌లతో తనిఖీలు చేయిస్తూ పరిశీలిస్తున్నారు. సీఎం పర్యటన రూట్‌మ్యాప్‌, హెలిప్యాడ్‌, కాన్వాయ్‌, బారికేడ్లు, ఇతరత్రా భద్రతాపరమైన విషయాలను చర్చించారు.  


logo