నులిపురుగులను నిర్మూలించాలి

- కలెక్టర్ హరిత
- రక్తహీనతను నివారించాలి
- ఓగ్లాపూర్‌లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
శాయంపేట/దామెర, ఫిబ్రవరి 10 : పిల్లల్లో అనారోగ్యానికి కారణమవుతున్న నులిపురుగులను రూపుమాపాలని కలెక్టర్ ఎం హరిత పిలుపునిచ్చారు. జాతీయ నులిపురుగు నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఓగ్లాపూర్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో జిల్లా వైద్యాశాఖ అధికారి చల్లా మధుసూదన్‌తో కలిసి విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలకు కలెక్టర్, డీఎంహెచ్వోలు మాత్రలు వేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ హరిత మాట్లాడుతూ 1-19 సంవత్సరాల వయసులోపు పిల్లలందరూ తప్పకుండా అల్బెండజోల్ మాత్రలను వేసుకోవాలని సూచించారు. ఇది రక్తహీనతను తగ్గిస్తుందన్నారు. దీంతో పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోగలుగుతారని, ఏకాగ్రతను మెరుగుపడుతుందన్నారు. ప్రతి విద్యార్థికి మాత్రలను వేయించి, నులిపురుగును పూర్తిగా నిర్మూలించేందుకు అందరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. డీఎంహెచ్‌వో చల్లా మధుసూదన్ మాట్లాడుతూ అల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం వల్ల బుద్ది మాంద్యాన్ని అరికట్టవచ్చన్నారు. ఈ మాత్రలను జిల్లాలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, అంగన్‌వాడీకేంద్రాల్లో వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి శ్యామ నీరజ, డిప్యూటీ డీఎంహెచ్‌వో శిరీష, డిప్యూటీ డెమో స్వరూపారాణి, డాక్టర్ కమల్చందు, రాజు, అశోక్‌బాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- వ్యాక్సిన్ తుసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్‌వేవ్ పరిస్థితులు
- మాల్దీవులలో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మీ ఫ్యామిలీ
- ఘనంగా నటుడు శోభన్ బాబు జయంతి
- కథ డిమాండ్ చేస్తే గ్లామర్ షోకు రెడీ అంటున్న ప్రియమణి
- యూకేలో జూలై 17 వరకు లాక్డౌన్ పొండగింపు