దుగ్గొండి పీఏసీఎస్ పీఠం టీఆర్ఎస్ కైవసం

దుగ్గొండి : దుగ్గొండి పీఏసీఎస్ పరిధిలో 13 టీసీలకు గాను 09 టీసీలు ఏకగ్రీవం కాగా టీఆర్ఎస్ బలపరిచిన 08 మంది అభ్యర్థులు, బీజేపీ బలపరిచిన ఒకరు ఏకగ్రీవమయ్యారు. ఏకగ్రీవమైన అభ్యర్థుల్లో టీసీ నెం.01 మానుపాటి సారమ్మ, టీసీ నెం.03 తోకల సృజన , టీసీ నెం. 04 పల్లె శ్రీనివాస్, టీసీ నెం.05 బూతం విజయ, టీసీ నెం.06 చల్లా పైడయ్య, టీసీ నెం,08 బట్టు పైడి, టీసీ నెం.11 కొంగర స్వరూప, టీసీ నెం.12 యాపశెట్టి బాబు, టీసీ నెం.13 ఎడ్డె చందర్రావులు ఏకగ్రీవం కాగా నాచినపల్లి పీఏసీఎస్ పరిధిలో టీసీ నెం. 03 సురావు సంజీవరావులు ఏకగ్రీవమయ్యారు. దుగ్గొండి మండల పరిధిలోని 4 పీఏసీఎస్ పరిధిలో మొత్తం 112 మంది అభ్యర్థుల్లో 10 మంది ఏకగ్రీవం కాగా 102 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు తెలిపారు...
ఆఖరి క్షణంలో..
దుగ్గొండి సహకార సంఘం ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ తరువాత 13 టీసీలకు గాను 09 టీసీలు ఏకగ్రీవం కాగా టీఆర్ఎస్ బలపరిచిన 08 మంది అభ్యర్థులు, బీజేపీ బలపరిచిన 01 గురు ఏకగ్రీవమయ్యారు. దీంతో చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడానికి కావాల్సిన 08 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. దీంతో టీఆర్ఎస్ బలం సరిపోయింది. ఈ క్రమంలో ఈనెల 17 జరిగే చైర్మన్ అభ్యర్థుల ఎంపిక టీఆర్ఎస్ అభ్యర్థికే ఖరారైందని టీఆర్ఎస్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి . చివరి క్షణం వరకు 6గురు అభ్యర్థులు మాత్రమే ఏకగ్రీవం కాగా ఇక చైర్మన్ ఏకగ్రీవం కావడానికి కష్టమనే తరుణంలో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య చివరి క్షణంలో ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్తులు ఏకగ్రీవం కావడంతో టీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ కావగం లాంఛనమైంది.
తాజావార్తలు
- విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
- వ్యాక్సినేషన్‌పై అపోహలు వద్దు
- రూ.1,883 కోట్ల మద్యం తాగేశారు
- శివ నిస్వార్థ సేవలు అభినందనీయం
- ఆర్మీ ర్యాలీలో తెలంగాణ సత్తా చాటాలి
- పట్టణ వేదిక.. ప్రగతి కానుక
- లక్ష్యంపై గురి!
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి