బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Feb 10, 2020 , 02:44:36

జీవాల సేవలో అతివలు

జీవాల సేవలో అతివలు

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 09 : జీవాల పెంపకందారులకు మరింతగా చేయూతనివ్వడానికి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది. జీవాలకు వారి గ్రామాల్లోనే అందుబాటులో సేవలందించేందుకు అతివకలకు అవకాశం కల్పిస్తున్నది. గ్రామాల్లోని మ హిళా సంఘాల సభ్యులలో గొర్రెలు, మేకలు, బర్రెలు ఉన్న సభ్యులను ఎంపిక చేసి వారితో మరో ప్రత్యేక పశు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పదో తరగతి చదవి, ఆసక్తి ఉన్న మహిళలను ఎంపికచేసి వారికి పశుమిత్రుగా అవకాశం కల్పిస్తున్నారు. పశుమిత్రలకు హైదరాబాద్‌లోని రా జేంద్రనగర్‌లో మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించి పశువులు, గొర్రెలు, మేకలకు వైద్య పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పశుమిత్రలు జీవాలకు వైద్య సేవలందించడం కోసం పరికరాలను కొనుగోలు చేసుకునేందుకు ఒక్కో సంఘానికి ప్రభుత్వం రూ.25వేల చొప్పున ఆర్థికసాయం కూడా అం దించింది. దీంతో పరికరాలను కొనుగోలు చేసిన పశుమిత్రలు రైతు ముంగిటనే వైద్య సేవలను అందిస్తూ రైతులకు చేయూతనిస్తూ మహిళలు కూడా ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నారు. జిల్లా లో ఇప్పటి వరకు 93 మంది పశుమిత్రలను ప్రభుత్వం నియమించి రైతులు, పెంపకందారులకు సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నది.

గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ఐకేపీ ద్వా రా రుణాలు పొంది జీవాలు, బర్రెలను కోనుగోలు చేస్తున్న మ హిళలు, పెంపకందారులు, రైతులకు గ్రామస్థాయిలో మరిన్ని సేవలందించేందుకు ప్రభుత్వం పశుమిత్రల నియామకానికి ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాలలో జీవాలు ఉన్న మహిళలను గుర్తించి ప్రతి సంఘంలో 15 నుంచి 20 మంది సభ్యులు ఉండేలా పశు ఉత్పత్తిదారుల మహిళా సంఘాలుగా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 88 సంఘాలను అధికారులు ఏర్పాటు చేయగా ఇందులో 1420 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులలో పదో తరగతి చదివి పశువులకు వైద్య సేవలందించాలనే ఆసక్తి ఉన్న మహిళను గుర్తించి ప శుమిత్రగా ఎంపిక చేస్తున్నారు. కొంతమంది పశుమిత్రలకు ఇ ప్పటికే  హైదరాబాద్‌లోని ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా పశుమిత్రల సేవలను అధికారులు ప్రారంభించారు. రానున్న రోజుల్లో పశుమిత్రలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తూ అ ధికారులు ఇందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

ప్రణాళికా ప్రకారం నిర్వహణ..

గ్రామాల్లో ఏర్పడుతున్న పశు ఉత్పత్తిదారుల సంఘాలు తీసుకున్న రుణాలపై కూడా పశుమిత్రలు పర్యవేక్షణ చేయనున్నారు. తీసుకున్న రుణాలతో విత్తన పొట్టేళ్లు కొనుగోలు చేయడం, కం పోస్టు ఎరువు తయారీ, పశుగ్రాసం పెంపకం, అవసరమైన దా నా, మందుల నిల్వ ఉండేలా చూస్తారు. పశుమాంసాన్ని విక్రయించుకునేలా సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అమ్మకాలు, కొనుగోల్లు తదితర విషయాలను కూడా సంఘాల సభ్యులకు సెర్ఫ్‌ ప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని 88 పశు ఉత్పత్తిదారుల సం ఘాల నుంచి 93 మంది పశుమిత్రలను ఎంపిక చేయగా ఇందు లో 59 మంది హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో శిక్షణ పూర్తి చేసుకొని గ్రామాల్లో సేవలందిస్తున్నారు. 

జిల్లాలో 88 పశు ఉత్పత్తిదారుల సంఘాలు

జిల్లాలో ఇప్పటి వరకు సెర్ఫ్‌ అధికారులు, సిబ్బంది 88 పశు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశారు. సంఘాల సభ్యులకు సంబంధించిన జీవాలకు మెరుగైన వైద్య సేవలందించి జీ వాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనివల్ల మాంసం ఉత్పత్తులు కూడా పెరిగి సంఘాలు బలోపేతం కావడంతో పాటుగా నాణ్యమైన మాంసం ప్రజలకు లభిస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. జిల్లాలోని 88 సంఘాలలో 69 సం ఘాలకు ప్రభుత్వం రూ.25వేల చొప్పున ఇప్పటికే మంజూరు చేసింది. ఈ నిధులతో పశుమిత్రకు అవసరమైన డ్రేంచింగ్‌ మి షన్‌, వ్యాక్సిన్‌ బాక్స్‌లు, డిజిటల్‌ తూకం, పవర్‌ స్ప్రేయర్‌, తదితర వస్తువులను కొనుగోలు చేశారు. త్వరలోనే మిగిలిన సంఘాలకు రూ.25వేల రివాల్వింగ్‌ ఫండ్‌ను ప్రభుత్వం మంజూరు చేయనున్నదని అధికారులు చెబుతున్నారు. 


logo