శుక్రవారం 05 జూన్ 2020
Warangal-rural - Feb 09, 2020 , 03:03:58

తల్లులను దర్శించుకున్న సభాపతులు

తల్లులను దర్శించుకున్న సభాపతులు
  • మొక్కులు చెల్లించుకున్న ప్రముఖులు

ములుగు జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ: సమ్మక్క-సారలమ్మను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న వారు గద్దెలపై కొలువుదీరిన తల్లులను  దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తల్లులకు వారు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. దర్శనం అనంతరం దేవాదాయశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వారికి సమ్మక్క-సారలమ్మ దేవతల ఫొటోలను అందజేశారు. 


మొక్కులు చెల్లించుకున్న కేంద్ర మంత్రి 

తల్లులు గద్దెలపై కొలువుదీరగా దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన పలువురు ప్రముఖులు  మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్రం గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ముండ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, శేరి సుభాశ్‌రెడ్డి, నవీన్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, ప్రభాకర్‌రెడ్డి, బేతి సుభాశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, డీఐజీ ప్రమోద్‌కుమార్‌ తల్లులను దర్శించుకున్నారు.


logo