గురువారం 21 జనవరి 2021
Warangal-rural - Feb 08, 2020 , 03:47:18

మేడారం వీధుల్లో సమ్మక్క సాగరం

మేడారం వీధుల్లో సమ్మక్క సాగరం

మేడారం వీధులు జనసాగరమయ్యాయి. గద్దెలపై కొలువైన తల్లీతనయలు శుక్రవారం భక్తుల నీరాజనాలు అందుకున్నారు. కొండంత దైవం, కొంగు బంగారానికి కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు తల్లులను దర్శించుకొని తరించారు. జాతర ఏర్పాట్లపై సీఎం ఆరా తీశారు. భక్తకోటిని దీవించి, ఆశీర్వదించిన సమ్మక్క శనివారం సాయంత్రం వనప్రవేశం చేయనుంది. సారలమ్మ కన్నెపల్లికి, పగిడిద్దరాజు పూనుగొండ్లకు, గోవిందరాజులు కొండాయికి తరలివెళ్తారు. దీంతో మహాజాతర పరిసమాప్తమవుతుంది. తల్లుల్ని కనులారా వీక్షించిన భక్తులు ఇంటిబాట పడుతుండడంతో మేడారం సిటీ మెల్లగా అడవైపోతున్నది.


logo