జాతరలో జనం - బోసిపోయిన నగరం

పోచమ్మమైదాన్ : ఎప్పుడు చూసినా.. ఎక్కడ చూసినా.. జనాల రద్దీతో కనిపించే వరంగల్ నగరం శుక్రవారం బోసిపోయి దర్శనమిచ్చింది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర చివరి దశకు చేరుకోవడం, శుక్రవారం సెలవు దినం కావడంతో నగరంలోని భక్తజనం మేడారం బాట పట్టారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నిర్మానుషంగా కనిపించాయి. సమ్మక్క-సారలమ్మను ఒకేసారి దర్శించుకునే భాగ్యం కోసం భక్తజనం మేడారంకు వెళ్లారు. అలాగే చాలామంది వ్యాపారస్తులు, చిన్న చిన్న దుకాణదారులు తమ షాపులను బంద్ చేసుకుని రెండు రోజుల పాటు అమ్మవార్ల సన్నిధిలో ఉంటూ విందు, వినోదాల్లో మునిగి తేలడానికి సిద్ధమై వెళ్లారు. దీంతో నగరంలో చాలా చోట్ల షాపులు, దుకాణాలు, కూరగాయల మార్కెట్లో షాపులు మూతపడ్డాయి.
రద్దీగా ములుగు రోడ్డు జంక్షన్..
మేడారం జాతరకు వెళ్లే వాహనాలకు ప్రధాన మార్గం.. ములుగు రోడ్డు కావడంతో రద్దీ పెరిగింది. 24 గంటలు పాటు వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. దీంతో ములుగు రోడ్డు జంక్షన్ నిరంతరం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే ట్రాఫిక్ పోలీసులు సకాలంలో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తుండటంతో వాహనాల రాకపోకలు సాఫిగా సాగుతున్నాయి. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా వన్‌వే ఏర్పాటు చేసి, పెద్దమ్మగడ్డ ద్వారా వాహనాలను పంపిస్తున్నారు. అయితే ములుగు రోడ్డు ప్రాంతం ఎక్కువగా భక్తులతో నిండిపోయింది. వరంగల్, హన్మకొండ మార్గం నుంచి జాతరకు వెళ్లే వాళ్లు, జాతర నుంచి వచ్చే వాళ్లు ములుగు రోడ్డు ప్రధానం కావడంతో భక్తుల సందడి ఏర్పడుతుంది.
తాజావార్తలు
- టెస్లా మస్క్ స్టైలే డిఫరెంట్.. పన్ను రాయితీకే ప్రాధాన్యం
- ఆ సీక్రెట్ అతనొక్కడికే తెలుసంటున్న నిహారిక..!
- చిరంజీవి మెగా ప్లాన్.. ఒకేసారి 2 సినిమాలకు డేట్స్..!
- బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
- ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్
- ఇక డేటా ఇన్ఫ్రా, కృత్రిమ మేధపైనే ఫోకస్
- ఆదిపురుష్ లాంఛింగ్‌కు టైం ఫిక్స్..!
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?
- విద్యార్థినులకు మొబైల్ ఫోన్లు అందించిన మంత్రి కేటీఆర్
- సెస్, సర్ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : మంత్రి హరీశ్ రావు