బుధవారం 03 జూన్ 2020
Warangal-rural - Feb 08, 2020 , 03:37:07

దస్‌ దిన్‌ దండకారణ్యంలోనే..

దస్‌ దిన్‌ దండకారణ్యంలోనే..

మేడారంబృందం, నమస్తేతెలంగాణ, ఫిబ్రవరి 07 : వారంతా భాగ్యనగర్‌ వాసులు. క్షణం తీరిక లేని వ్యాపారులు. కానీ, వారికి తల్లులంటే ప్రాణం. పది రోజుల ముందే మేడారం చేరుకుని గుడారాన్ని ఏర్పాటు చేసుకొని అందులోనే తాత్కాలిక లంకవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తల్లుల గద్దెలను నిర్మించి దానిపై సమ్మక్క, సారలమ్మ ప్రతిమలను బంగారంతో తయారు చేసి చీర, గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇలా ప్రతి జాతరకూ 80 మంది వరకు మేడారం వస్తుంటారు. వీరు ఎన్నో ఏళ్లుగా ఇక్కడికి వస్తున్నట్టు తెలిపారు. నాలుగు రోజుల పాటు తల్లులను కొలిచిన వీరు సమ్మక్క తల్లిని గద్దెకు తీసుకొచ్చే సమయంలో తమ గుడారంలోని లంకలో పేర్చిన తల్లుల సామగ్రితో ప్రత్యేకంగా అలంకరించుకుంటారు. డోలు వాయిద్యాలు, హోలీ సంబురాలతో జంపన్న వాగు నుంచి తల్లుల గద్దెలకు చేరుకుంటామని హైదరాబాద్‌లోని మల్కాజిగిరికి చెందిన కృష్ణారావు ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. తల్లులు గద్దెకు చేరిన తర్వాత వారిని కొలిచిన సామగ్రిని గద్దెల వద్ద చెల్లించి మొక్కులు సమర్పించుకుంటామని వెల్లడించారు. తల్లులు వనప్రవేశం చేసిన తర్వాత తమ పదిరోజుల జాతర ముగుస్తుందని ఆయన చెప్పారు.


logo