జాతరను విజయవంతం చేయాలి

మేడారం బృందం, నమస్తే తెలంగాణ: మేడారం సమ్మక్క-సారలమ్మను భక్తులు సజావుగా దర్శించుకునేలా చూ డాలని, జాతర విజయవంతానికి అధికార యంత్రాంగం కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. బుధవారం డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి మేడా రం ఆలయ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలిగించకుండా, మంచి జ్ఞాపకాలతో మేడా రం నుంచి తిరిగి వెళ్లేలా చూడాలని కోరారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేశామని, భక్తులకు ఎలాంటి లోటులేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభు త్వం జాతర నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ జాతర ఏర్పాట్లు, భక్తుల తాకిడిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని గుర్తు చేశారు. ముఖ్యమం త్రి కేసీఆర్ జాతరకు ఇస్తున్న ప్రాముఖ్యతను గుర్తించాలని సూచించారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన సోమేశ్‌కుమార్, డీజీపీ హెలీప్యాడ్ నుంచి జంపన్నవాగు వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తూ గద్దెలకు చేరుకున్నారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.
నిరంతరం అప్రమత్తం: డీజీపీ మహేందర్‌రెడ్డి
మేడారం మహాజాతరలో నిరంతరం అప్రమత్తంగా ఉం డాలని డీజీపీ కే మహేందర్‌రెడ్డి పోలీసులను ఆదేశించారు. బుధవారం మేడారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో కలిసి ఆయన పర్యటించారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా గత జాతరలో పని చేసిన నిష్ణాతులైన, అనుభవం గల అధికారులను నియమించామన్నారు. ఇద్దరు డీఐజీలు, ఆరుగురు ఎస్పీలు, 12 వేల మంది పోలీస్ సిబ్బంది తో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మ హిళా భక్తుల కోసం ప్రత్యేకంగా షీటీంలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో భక్తుల కోసం సైన్ బోర్డులను ఏర్పాటు చేశామని, జాతర పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. భక్తులు, అధికారులు జాతర విజ యవంతానికి సహకరించాలని డీజీపీ కోరారు.
తాజావార్తలు
- జగత్ విఖ్యాత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దు
- పునర్జన్మలపై నమ్మకమే మదనపల్లి హత్యలకు కారణం !
- అధికార పార్టీకి దురుద్దేశాలు అంటగడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
- పార్లమెంట్ మార్చ్ వాయిదా : బీకేయూ (ఆర్)
- ఢిల్లీ సరిహద్దులో గుడారాలు తొలగిస్తున్న రైతులు
- హెచ్-1 బీ నిపుణులకు గ్రీన్ కార్డ్.. షార్ట్‌కట్ రూటిదే?!
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి : మంత్రి మల్లారెడ్డి
- ఇద్దరు గ్రామస్తులను హతమార్చిన మావోయిస్టులు
- రేపు ఏపీ గవర్నర్‌ను కలవనున్న బీజేపీ, జనసేన బృందం
- పవన్ కళ్యాణ్‌కు చిరు సపోర్ట్..జనసేన నేత కీలక వ్యాఖ్యలు