మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Feb 06, 2020 , 02:27:44

భక్తులతో పోటెత్తిన రైల్వే స్టేడియం

భక్తులతో పోటెత్తిన రైల్వే స్టేడియం

కాజీపేట, ఫిబ్రవరి 05 : కాజీపేట రైల్వే స్టేడియం మేడారం జాతర భక్తులతో బుధవారం పోటెత్తింది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాత ప్రారంభమైం ది.  మొదటి రోజు బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెకు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు  రైల్వే స్టేడియంలో ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్‌ పాయింట్‌కు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు మేడారం భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాలతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి భక్తులు కాజీపేట రైల్వేజంక్షన్‌కు చేరుకున్నారు. రైల్వే స్టేడియంలో జాతర బస్సుల కోసం  గంటల తరబడి క్యూలో నిరీక్షించారు. ఆర్టీసీ అధికారులు భక్తుల కోసం సూపర్‌ లగ్జరీ, వజ్రా బస్సులను కూడా అందుబాటులో ఉంచారు. భక్తులు చార్జీలకు వె నుకాడకుండా బస్సుల్లో తరలివెళ్లారు. జాతరకు వెళ్లేందుకు భక్తులు విపరీతంగా రావడంతో స్టేడియం కిక్కిరిసి పోయింది. దుమ్ము కూడా లేవడంతో అధికారులు వెంటనే ట్రాక్టర్లతో నీటిని చల్లించారు. 


పరిసరాల్లో బ్లీచిం గ్‌ పౌడర్‌ చల్లి, దుర్వాసన  రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జాతర పాయింట్‌లో అర్బన్‌ హెల్త్‌ మెడికల్‌ వైద్యాధికారులు రవళి, కీర్తిలు భక్తులకు వైద్య పరీక్షలు చేసి  పంపిణీ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి రాత్రి పలు రైళ్ల ద్వారా జాతరకు వచ్చిన భక్తులు స్టేషన్‌లోనే సేదతీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక పోలీసులు, ఆర్టీసీ సెక్యూరి టీ, జీఆర్పీ, ఆర్పీఎఫ్‌  సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటల వరకు 172 బస్సుల్లో 10,065 మంది పెద్దలు, 1006 మంది చిన్న పిల్లలను మేడారానికి తరలించినట్లు వరంగల్‌-2 డిపో మేనేజర్‌ కేశరాజు భానుకిరణ్‌ తెలిపారు. దీంతో దాదాపు రూ.20లక్షల ఆదాయం వచ్చిందని, అర్ధరాత్రి  వరకు మరో రూ.8లక్షలు రావొచ్చునని పేర్కొన్నారు. కాగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ బస్‌ పాయిం ట్‌  ఇన్‌చార్జి బైరి రవీందర్‌ పర్యవేక్షిస్తున్నారు. 


logo