ఆదివారం 24 జనవరి 2021
Warangal-rural - Feb 05, 2020 , 04:05:13

‘గట్టమ్మ’ ఆలయం జనసంద్రం

‘గట్టమ్మ’ ఆలయం జనసంద్రం

ములుగురూరల్‌, ఫిబ్రవరి 04 : తెలంగాణ కుం భమేళా మేడారం మహా జాతర బుధవారం ప్రారంభంకానుంది. వన దేవతలను దర్శించుకునేందుకు భక్తజనం తండోపతండాలుగా మేడారం బాటపట్టారు. ఈక్రమంలో ములుగు మండలం జాకారం పంచాయతీ పరిధిలోని గట్టమ్మ ఆలయానికి మంగళవారం భక్తుల తాకిడి పెరిగింది. ఉదయం నుంచి భక్తుల సందడి అంతంత మా త్రంగా ఉండగా, మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా జనసంద్రంగా మారింది. గట్టమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులు ఆలయ ఆవరణలో గల సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద పసుపు, కుంకుమ సమ ర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భారీగా తరలివస్తున్న వాహనాలతో గట్టమ్మ తల్లి ఆలయ ప్రాంగణమంతా జనాలతో కిక్కిరిసింది. అనంతరం అమ్మవార్ల దర్శనం కోసం వాహనాలు మే డారం బాటపట్టాయి. 


ట్రాఫిక్‌పై సీపీ నజర్‌ 

మేడారం మహా జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివెళ్తున్న నేపథ్యంలో ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌, ట్రాఫిక్‌ సెక్టార్‌ ఇన్‌చార్జి రవీందర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు గట్టమ్మ ఆల యం వద్ద ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.


మూడు షిఫ్టులుగా విధులు

మేడారం మహాజాతర సందర్భంగా గట్టమ్మ ఆలయం వద్ద పోలీసు సిబ్బంది మూడు షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏఎస్పీ సిద్ధార్థ నేతృత్వంలో ఒక్కో షిఫ్ట్‌లో ఒక డీఎస్పీ, నలుగురు ఎస్సైలు, 40 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వర్తిస్తున్నారు. మొత్తం మూడు షిఫ్ట్ట్‌లుగా ము గ్గురు డీఎస్పీలు, 12 మంది ఎస్సైలు, 120 మం ది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు.


సెక్టోరల్‌ అధికారుల సేవలు 

గట్టమ్మ ఆలయం వద్ద భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాహనాలు నిలిపే స్థలం వివరాలను సెక్టోరల్‌ అధికారులు వెల్లడిస్తున్నారు. తహసీల్దార్‌ సత్యనారాయణస్వామి, డీటీ పద్మజ, ఆర్‌ఐ ర జాక్‌, వీఆర్వోలు రవి, నాగరాజు, వీఆర్‌ఏలు వి ధులు నిర్వహిస్తున్నారు. 


ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన

ప్లాస్టిక్‌ నియంత్రణ ప్రతీ ఒక్కరి బాధ్యతని, మే డారం జాతరలో ప్లాస్టిక్‌ను నిషే ధించాలని, భ క్తులు తీసుకువచ్చే ప్లాస్టిక్‌ను గట్టమ్మ ఆలయం వ ద్ద ఏర్పాటు చేసిన కాలకేయ విగ్రహం వద్ద వదిలివెళ్లాలని అవగాహన కల్పిస్తున్నారు. 


logo