శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Feb 04, 2020 , 03:05:22

సహకార ఎన్నికలకు సిద్ధం కావాలి

సహకార ఎన్నికలకు సిద్ధం కావాలి

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : త్వరలో జరిగే సహకార ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నా రు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15న జరగనున్న సహకార సంఘం ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వర్ధన్నపేట మండల పరిధిలో ఉన్న పీఏసీఎస్‌లోని అన్ని టీసీలు టీఆర్‌ఎస్‌ గెలుచుకునేలా చూడాలన్నారు. తక్కువ ఓట్లు మాత్రమే ఉన్నందున ప్రతి టీసీ పరిధిలో పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేసి అభ్యర్థులను గెలిపించాలన్నారు.  అలాగే, అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సమన్వయం తో పనిచేయాలని సూచించారు. సమర్థులైనవారినే నిలపనున్నట్లు చెప్పారు.  సమావేశంలో టీ ఆర్‌ఎస్‌ రైతు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జెడ్పీటీసీ మార్గం బిక్షపతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి  పాల్గొన్నారు.

పీఏసీఎస్‌లను అన్నీ కైవసం చేసుకోవాలి 

పర్వతగిరి :   పీఏసీఎస్‌ ఎన్నికల్లో అన్నింటినీ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎర్రబెల్లి జగన్నాథరావు ప్రాంగణంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఏసీఎస్‌లలో అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే గెలవాలన్నారు.  పీఏసీఎస్‌ డైరెక్టర్లు, చైర్మన్‌లను ఏకగ్రీవం చేసుకోవాలని సూచించారు. గ్రామాలలో క్షేత్ర స్ధాయిలో కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా ముందు కు సాగాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధి పథకాలతో పూర్తి మెజారిటీ టీఆర్‌ఎస్‌కే వస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు జెడ్పీటీసీ బానోతు సింగ్‌లాల్‌, మనోజ్‌కుమార్‌గౌడ్‌, మార్కెట్‌ డైరెక్టర్లు పల్లెపాటి శాంతిరతన్‌రావు, పట్టపురం ఏకాంతంగౌడ్‌, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యులు సర్వర్‌, భాస్కర్‌రావు, సోమేశ్వర్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్‌, నాయకులు జితేందర్‌రెడ్డి, మేడిశెట్టి రాములు, గటిక మహేష్‌, గంధం బాస్కర్‌, మాలతీ అమడగాని రాజు, పంజా మహేశ్‌, బానోతు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.