అభివృద్ధికి సహకరించాలి

ఆత్మకూరు, జనవరి 31 : అభివృద్ధికి గ్రామస్తులందరూ సహకరించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణంతో పాటు, డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు వెడల్పు కార్యక్రమాల్లో ఇళ్లు కొల్పోయిన వారికి ప్రభుత్వం డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. ఈ మేరకు వాటి నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అనంతరం గ్రామ శివారులో రోడ్డు పనులకు అంటకం కలిగించిన వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. పోచమ్మగుడి నుంచి శివాలయం వరకు అగిపోయిన రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న కరంటు స్తంభాలను వెంటనే తొలగించాలన్నారు. గ్రామాభివృద్ధికి పార్టీలకతీతంగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, తిరుమలగిరి సర్పంచ్ మనోహర్, ఎంపీటీసీ బయ్య రమ, టీఆర్ఎస్ నాయకులు కానుగంటి సంపత్‌కుమార్, ఆత్మకూరు, కామారం గ్రామాల టీఆర్ఎస్ అధ్యక్షులు భాషబోయిన పైడి, తోట కుమార్, రైతు కోఆర్డినేటర్ భాషబోయిన సాగర్, పాపని రవీందర్, పెరుమాండ్ల బిక్షపతి, అండ్ర విశ్వేశ్వర్‌రెడ్డి, ఎండీ అంకుస్, రహీమోద్దిన్, బైగాని రాజేందర్, భాషబోయిన సదానందం, భాషబోయిన రాజు, నత్తి రవి పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయవతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
- చిరంజీవి బిగ్ సర్ప్రైజ్.. 2021లో డబుల్ డోస్ ఇస్తున్నాడా..?
- హైదరాబాద్-చికాగో నాన్‌స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం