సమాజ మార్గ నిర్దేశకులు ఉపాధ్యాయులే

రాయపర్తి, జనవరి 31 : సమాజ మార్గ నిర్దేశకులు ఉపాధ్యాయులేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని సన్నూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బందు నారాయణ ఉద్యోగ విరమణ సభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఉపాధ్యాయుల చేతుల్లోనే దేశంతోపాటు యువత భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు చూపిన దారిలో విద్యార్థులు ముందుకు సాగితే జాతి గర్వించే బిడ్డలుగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ విద్యాలయాలకు పంపవద్దని కోరారు. అనంతరం బందు నారాయణ దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సింహారెడ్డి, ఉపాధ్యాయ సం ఘాల బాధ్యులు చావ రవి, మైస శ్రీనివాస్, బొజ్జ భిక్షమయ్య, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, రాయపర్తి పీఏసీఎస్ చైర్మన్ బిల్ల సుధీర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, సర్పంచ్ నలమాస సారయ్య, ఉప సర్పంచ్ పయ్యావుల కొమురుమల్లు, ఇన్చార్జి హెచ్ఎం చెడుపాక కృష్ణమూర్తి, గా యకుడు గిద్దె రాంనర్సయ్య, ఎంపీటీసీ భూక్య గోవింద్‌నాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- రోటోవేటర్ కిందపడి బాలుడు మృతి
- విజయ్ దేవరకొండపై భారీ బడ్జెట్ వర్కవుట్ అయ్యేనా..?
- 'వకీల్‌సాబ్' కామిక్ బుక్ కవర్ లుక్ అదిరింది
- 23న ఎఫ్‌టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం..
- శింబును వెలేసిన నిర్మాతల మండలి..?
- వేరుశనగ క్వింటాల్ @ రూ.7,712
- లైంగిక దాడి కేసులో వ్యక్తి 27 ఏళ్లు జీవిత ఖైదు
- ఈ 31లోపు అర్హులైన అందరికీ పదోన్నతులు : వి. శ్రీనివాస్ గౌడ్
- మీరారాజ్‌పుత్ హొయలు చూడతరమా..!
- ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం