మినీ మేడారం అగ్రంపహాడ్

ఆత్మకూరు, జనవరి 28 : జిల్లాలోనే రెండో అతి పెద్ద జాతరగా పేరొందిన అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర పనులు వేగంవంతం చేస్తున్నారు. జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు వస్తుంటారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత అధికారు లు, ప్రజాప్రతినిధులు జాతర పనుల పర్యవేక్షణలోనే ఉంటున్నారు. సమ్మక్క సారలమ్మ, చౌడలమ్మ ప్రాంగణంలో ఎన్నడూ విధంగా సుందరీకరణ పనులు చేపట్టారు. వచ్చే నెల 5 నుంచి 9 వరకు జరిగే జాతర కోసం భక్తుల తాగునీటికి ప్రత్యేక వాటర్ ట్యాంక్‌లు, 35 బోరింగ్‌లను ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణంలో అవసరమున్న చోట వాటర్ పం పులను ఏర్పాటు చేశారు. జాతర చుట్టూ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. తల్లులను దర్శించుకునేందుకు ముందుస్తుగానే భక్తులు తరలివస్తున్నారు.
జాతర కమిటీ ఎన్నిక
మినీ మేడారమైన అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర కమిటీని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మంగళవారం ప్రకటించారు. చైర్మన్‌గా అగ్రంపహాడ్ గ్రామానికి చెందిన కత్తెరశాల మల్లేశంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే, కమిటీ సభ్యులుగా పెద్దాపురం గ్రామానికి చెందిన చెంచు ప్రభాకర్, అగ్రంపహాడ్ గ్రామానికి చెందిన గుండెబోయిన రాజన్న, మడిపెల్లి భాగ్య, చౌళ్లపల్లి గ్రామానికి చెందిన మోరే మహేందర్ ఎన్నికయ్యారు. మేరకు నూతన కమిటీ సభ్యులు హన్మకొండలోని ఎమ్మెల్యే చల్లా నివాసంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. బుధవారం ఉదయం 11గంటలకు జాతర ప్రాంగణంలో చైర్మన్‌తో పాటు, కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్న ట్లు మార్కెట్ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి తెలిపారు. మండలంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరిలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, కార్యదర్శి బొల్లోబోయిన రవియాదవ్, ఎంపీటీసీ గండు రాము, సర్పంచ్ మాదాసి అన్నపూర్ణరాజు, కుడా డైరెక్టర్ రవీందర్, పుల్యాల రఘుపతిరెడ్డి, సిలువేరు నర్సయ్య పాల్గొన్నారు.
నేడు పొలిమేర బంధన
అగ్రంపహాడ్‌లో బుధవారం పొలిమేర బంధన నిర్వహించనున్నారు. సమ్మక్క సారలమ్మ దేవతలు బుధవారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. పసుపు కుంకుమ భరిణిలతో మేళా వాయిద్యాల నడుమ ముందుస్తుగా సారలమ్మ దేవత కొలువుదీరిన గోనెల వెంకన్న, సమ్మక్క కొలువు దీరిన గోనెల సారంగపాణి ఇంట్లో పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి పూజారులు దేవతల గద్దెల వద్దకు చేరుకోని అగ్రంపహాడ్ గ్రామాన్ని దిగ్భందనం చేస్తారు. ప్రత్యేక పూజలతో అమ్మవార్ల గద్దెల నుంచి కిలో మీటర్ వరకు నాలుగు వైపులా దుష్టశక్తులు ప్రవేశించకుండా పసుపు, కుంకుమభరిణితో అడ్డుకట్టవేస్తారు. మధ్యాహ్నం వరకు ఈ తంతు ముగియనుంది. సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు గద్దెల వద్ద పూజారులు గోనెల సారంగపాణి, గోనె ల వెంకన్న, గుల్లపల్లి సాంబశివురావు, గోనెల రవీందర్, ఊడుతన బోయిన గోవర్ధన్. గోనెల విశ్వనాథ్, రేగుల సునీత, గోనెల లక్ష్మి వరి గడ్డితో ప్రత్యేకంగా తాడును తయారు చేసి ఉట్టి కట్టి పసుపు, కుంకుమ, బెల్లం, కల్లుతో నైవే ద్యం పెట్టి అమ్మవార్లను శాంతిపరుస్తా రు. అనంతరం మేకలను బలి ఇస్తారు. పగిడిద్దరాజుకు నూతన వస్ర్తాలంకరణ చేసి, అక్కడ నుంచి అర్ధరాత్రి పూజారులు నిష్క్రమిస్తారు. ఈ పూజలు జరిగే వరకు పిల్లలు, భక్తులను గద్దెల వద్దకు పూజారులు అనుమతించరు. కాగా, గ్రామంలో ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది.
తాజావార్తలు
- టిక్‌టాక్‌పై శాశ్వత నిషేధం: కేంద్రం సంకేతాలు
- ‘తాండవ్’లో వారి నాలుక కత్తిరిస్తే రూ.కోటి నజరానా:కర్ణిసేన
- వైట్‌హౌస్ ముందు బైడెన్‌కు తొలి అపశృతి!
- వర్క్ ఫ్రం హోం: అతివలకే కార్పొరేట్ల ఓటు!
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్‌కు ఎఫ్‌టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్