సమాజంలో ఉపాధ్యాయుడి పాత్ర గొప్పది

నర్సంపేట రూరల్, జనవరి27: సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర చాలా గొప్పదని రాష్ట్ర పరిశీలకుడు ప్రొఫెసర్ టీ మనోహరచారి అన్నారు. మండలంలోని లక్నెపల్లి గ్రామ శివారు బాలాజీ టెక్నో స్కూల్లో సోమవారం 4వ విడత నిష్ట శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరగతులను రాష్ట్ర పరిశీలకుడు, ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ టీ మనోహరచారి, వాసవి పరిశీలించారు. శిక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన అన్ని తరగతులను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిష్ట శిక్షణ తరగతులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 2257మంది ఉపాధ్యాయులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. నిష్ట శిక్షణ తీసుకుంటున్న ప్రతి ఉపాధ్యాయుడు ప్రీ టెస్ట్, ఆతర్వాత పోస్ట్ టెస్ట్ తప్పని సరిగా ఆల్‌లైన్‌లో నమోదు చేయాలని కోరారు. ఐసీటీ విద్యను విలీనవిద్య, కళాసంలీత విద్య, స్కూల్ బేస్డ్ అసైన్మెంట్ పెడగోజి ఆఫ్ మ్యాస్, సైన్స్, లాంగ్వేజేస్, సోషల్, ఈవీఎస్ అంశాలపై ఉపాధ్యాయులు పట్టు సాధించి ఉండాలని సూచించారు. పాఠశాల విద్యాభివృద్ధికి ఈశిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని తెలిపారు. శిక్షణలో గ్రహించిన విషయాలను పాఠశాలల్లో విధిగా అమలు చేయాలని కోరారు. శిక్షణ కార్యక్రమాలను సరైన రీతిలో నడిపించడంలో కోర్సు డైరెక్టర్లు, ఎస్‌ఆర్జీలు, కేఆర్పీలు పూర్తి స్థాయిలో బాధ్యతను నెరవేరుస్తున్నారని అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో దేవా, కోర్సు డైరెక్టర్ సంపత్, ఎస్‌ఆర్జీలు సదాశివరావ్, ఆనందం, కృష్ణమూర్తి, మోహన్‌రావు, కేఆర్పీ రాంగోపాల్, రాంమోహన్, లోకేశ్వర్‌రావు, నవీన్, వెంకటరమణ, గౌస్‌పాషా, యాదయ్య, సతీశ్, ప్రకాశ్, పరిపూర్ణాచారి, మధు, వివిధ మండలాల ఉపాధ్యాయులు, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కొత్త యాప్‌లు వాడుతున్న ఉగ్ర మూకలు
- త్వరలో మరో ‘జన్ రసోయి’ని ప్రారంభిస్తాం: గౌతమ్ గంభీర్
- రైతు సంక్షేమానికి సర్కారు కృషి : మండలి చైర్మన్ గుత్తా
- నానబెట్టిన నల్ల శనగలు తినొచ్చా.. తింటే ఏంటి లాభం.?
- సీఎంఆర్ సంస్థను రద్దు చేయాలి
- ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో కేసీఆర్‌కు ఐదో స్థానం
- స్టంట్ చేస్తుండగా సంపూర్ణేశ్‌కు ప్రమాదం..!
- ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు
- మెరుగ్గానే శశికళ ఆరోగ్యం
- రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా సంగక్కర