మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Jan 28, 2020 , 05:19:49

ప్రజావాణి విన్నపాలు సత్వరం పరిష్కరించాలి

ప్రజావాణి విన్నపాలు సత్వరం పరిష్కరించాలి

శాయంపేట, జనవరి 27 : ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే విన్నపాలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్‌ హరిత ఆదేశించారు. మండలాల్లో రెవెన్యూ అధికారులు ప్రజావాణి రోజు తప్పకుండా అందుబాటులో ఉండాలని స్పష్టం చేవారు.  కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి వినతులను స్వీకరించి ప్రజల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందరర్భంగా ప్రజావాణిలో 49 విజ్ఞప్తులు రావడంతో వాటిని వెంటనే పరిష్కరించాలని ఆధికారులను అదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి ప్రజలు తమ విన్నపాలు తెలిపేందుకు వస్తున్నారన్నారు. వారి సమస్యలను పరిశీలించి అధికారులు పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజావాణి జరిగే రోజున మండలాల్లో రెవెన్యూ అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి, కలెక్టరేట్‌ ఏవో రాజేంద్రనాథ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


logo