బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Jan 25, 2020 , 02:35:55

అగ్రంపహాడ్ జాతరను అభివృద్ధి చేసి చూపిస్తా

అగ్రంపహాడ్ జాతరను అభివృద్ధి చేసి చూపిస్తాఆత్మకూరు, జనవరి 24 : సమ్మక్క - సారక్క పుట్టినిల్లయిన అగ్రంపహాడ్ గ్రామ శివారులో రెండు సంవత్సరాల కొకసారి అత్యంత్య వైభవంగా జరిగే సమ్మక్క - సారక్క జాతరను మేడారం జాతరకు తీసిపొకుండా నిర్వహిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చేసి పనులను శుక్రవారం ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడి, వివిధ శాఖల అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ జాతరకు వచ్చేభక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వసతులు కల్పిస్తామన్నారు. జాతర ప్రాంగణంలో అన్ని శాఖల అధికారు ల సమన్వయంతో దాదాపు పనులు అన్ని పూర్తిస్థాయిలో జరుగుతున్నాయన్నారు. మేడారం జాతర కంటే  ముందు గా ఇక్కడ జాతర జరిగేదన్నారు. ప్రతి జాతరకు సుమారు 40 లక్షల మంది భక్తులు మొక్కులను చెల్లించుకుంటారని ఆయన తెలిపారు. జాతర చుట్టు పంట పొలాలు ఉన్న రై తులు భక్తులకు సహకరించాలని కోరారు. జాతరకు రెండు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చారు. జాతరలో అభివృద్ధి జరుగుతున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. జాతర విజయవంతానికి అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నా రు. ఈ కార్యక్రమంలో ఏనుమాములు మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం, ఎంపీపీ మార్క సుమలత, జెడ్పీటీసీ కక్కెర్ల రాధిక, గూడెప్పాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, సర్పంచ్‌లు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధర్మరాజు,సర్పంచ్‌లు మాదాసి అన్నపూర్ణరాజు, ఎనకతళ్ల విజయహాంసాల్‌రెడ్డి, ఎంపీటీసీలు బొమ్మగాని భాగ్యరవి, బయ్య రమరాజు, ఎంపీడీవో నర్మద, తహసీల్దార్ ఎస్‌కే ముంతాజ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బొల్లెబోయిన రవియాదవ్, నాయకులు తోట కుమార్, గుర్రం వేణు, డీఆర్, సావురే రాజేశ్వర్‌రావు, జీ రాజన్న, కత్తేరశాల మల్లేశం, టీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు వేముల నవీన్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు కాకాని శ్రీధర్ పాల్గొన్నారు. 

జాతర ఈవోపై  ఎమ్మెల్యే ఆగ్రహం

గత జాతరలో హాండీల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇష్టా నుసారంగా చేయడంపై జాతర ఈవో ధనుంజయ శర్మపై ఎమ్మెల్యే చల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత జాతరలో మిగిలిన రూ.10 లక్షలను వన దేవతల గద్దెల చుట్టూ స్థలాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా ఆ స్థలాన్ని కొనుగోలు చేయకుండా ఉండడం వల్ల జాతరకు స్థలం లేకుండా చేశావని ఈవో పనితీరుపై మండిపడ్డారు. ఇప్పటికైనా జాతర వచ్చే ఆదాయాన్ని జాతరకు ఉపయోగపడేవిధంగా ఖర్చు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.logo