శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Jan 24, 2020 , 04:51:38

పండ్ల మార్కెట్‌కు రూ.6.50 కోట్లు

పండ్ల మార్కెట్‌కు రూ.6.50 కోట్లుగ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మూడో డివిజన్‌ పరిధిలోని గొర్రెకుంట శివారులో పండ్ల మార్కెట్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.6.50 కోట్లు మంజూరు చేసిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. మండలంలోని గొర్రెకుంట శివారులో పండ్ల మార్కెట్‌ కోసం కేటాయించిన స్థలాన్ని గురువారం ఎమ్మెల్యే చల్లా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు, శానిటేషన్‌కు సంబంధించిన పనుల కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని మున్సిపల్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత స్థలంలో ఉన్న ముళ్లపొదలు, పిచ్చిమొక్కలను వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే చల్లా పేర్కొన్నారు.                  

- గీసుగొండ విలేకరి

గీసుగొండ, జనవరి 23 : మండలంలోని గొర్రెకుంట శివారులో గ్రేటర్‌ మూడో డివిజన్‌ శివారులో  పండ్ల మార్కెట్‌ నిర్మాణం కోసం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  గురువారం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలం ఎంత ఉందో తక్షణమే సర్వేచేసి హ ద్దులు నిర్ణయించాలని  రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. మార్కెట్‌ నిర్మాణానికి ప్రభుత్వం  రూ.6.50కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆర్‌అండ్‌బీ నుంచి మార్కెట్‌ నిర్మాణం కోసం పరిశీలించిన ప్రభుత్వ స్థలం వరకు నూతన రోడ్ల నిర్మాణం, సానిటేషన్‌కు సంబందించిన తదితర పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్‌ అధికారుల ను ఆదేశించారు. ప్రస్తుత స్థలంలో ఉన్న ముళ్లపొదలు, పిచ్చిమొక్కలను వెంటనే తొలగించాలన్నారు.  కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చింతం సదానందం, కార్పొరేటర్లు లింగం మౌనిక, శివ, లాదేళ్ల బాల య్య, మార్కెట్‌ డైరెక్టర్‌ గుర్రం రఘు, జెడ్పీటీసీ పో లీసు ధర్మారావు, టీఆర్‌ఎస్‌ నాయకలు నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, గోపాల నవీన్‌రాజ్‌, గోలి రాజ య్య, వేణు, రాజు, కరుణాకర్‌, తహసీల్దార్‌ కనకయ్య, ఏఈ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.