ఎర్రబెల్లి గెలుపు మంత్రం

- - పరకాల, నర్సంపేటలో మంత్రి పర్యటన
- - ఎమ్మెల్యేలు చల్లా, పెద్దితో సమావేశం
- - అభ్యర్థుల విజయం.. పోలింగ్ జాగ్రత్తలపై సమాలోచనలు
(వరంగల్ జిల్లాప్రతినిధి- నమస్తేతెలంగాణ) : పోలింగ్ ఒకరోజు ముందు అంటే మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ జిల్లాలో పర్యటించారు. నర్సంపేట, పరకాల సందర్శించి స్థానిక ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ చల్లా ధర్మారెడ్డి, టీఆర్ ముఖ్యనేతలతో సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లోనూ టీఆర్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేక వ్యూహ రచన చేశారు. టీఆర్ తిరుగులేని రాజకీయశక్తిగా మార్చటం లక్ష్యంగా ఆయన ఈ ఎన్నికల్లో తన వ్యూహాలను అమలు చేస్తున్నారు. పురపోరులో టీఆర్ అభ్యర్థులందరూ ఏకపక్షంగా విజయం సాధించటం టార్గెట్ మంత్రాంగం జరిపారు.
పరకాలలోని 22 వార్డులకు గాను ఇప్పటికే పదకొండు వార్డుల్లో టీఆర్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమై ఆదిపత్యం సాధించటం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మరోసారి స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, టీఆర్ నేతలకు అభినందనలు తెలిపారు. పోలింగ్ జరిగే మిగత 11 వార్డుల్లోనూ టీఆర్ అభ్యర్థులు రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొందే విధంగా పోలింగ్ రోజున జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఎమ్మెల్యే ధర్మారెడ్డితో పేర్కొన్నారు. నర్సంపేటలోనూ టీఆర్ గెలుపు ఏకపక్షంగా ఉంటుందనే సమాచారం ఉందని... దీన్ని సాధించాలని మంత్రి స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ అన్నారు.
తాజావార్తలు
- జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు
- స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ రూ.1000 కోట్లు
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?
- కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.91 లక్షల మందికి కరోనా టీకా