గురువారం 21 జనవరి 2021
Warangal-rural - Jan 21, 2020 , 02:44:05

టీఆర్‌ఎస్‌ పాలనలో పట్టణాలకు మహర్దశ

 టీఆర్‌ఎస్‌ పాలనలో పట్టణాలకు మహర్దశ
  • - విపక్షాలకు ఓట్లు అడిగే అర్హతలేదు
  • - ఎన్నికలు ఆపాలని చూసి బోర్లా పడిన కాంగ్రెస్‌
  • - విపక్షాలకు ఓట్లు వేస్తే మురుగు కాల్వలో వేసినట్లే
  • - పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, జనవరి 20 : రాష్ట్ర ము ఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలన దక్షతతో రాష్ట్రంలోని పట్టణాలు ఎతో అభివృద్ధి సాధిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా వర్ధన్నపేటలో సోమవారం నిర్వహంచిన రోడ్‌షో, ప్రచారసభలో మంత్రి దయాకర్‌రావు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రంలోని ఏ పట్టణానికి కూడా రూపాయి కేటాయించి అభివృద్ధి చేయలేదన్నా రు. కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా పట్టణాలకు ఏమాత్రం నిధులు కేటాయించలేదన్నారు. కానీ ప్రస్తుతం జరుగుతు న్న ఎన్నికల్లో మాత్రం తమకు ఓట్లు వేయాలని ఆ పార్టీల నేతలు ప్రచారాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర సాధన తరువాత అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ ఆరేళ్లలోనే సీఎం కేసీఆర్‌ పట్టణాలను ఎంతగానో అభివృద్ధి చేస్తున్నాడని గుర్తు చేశారు. ప్రధానంగా నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధి కో సం ఎమ్మెల్యే అరూ రి రమేశ్‌ కోరిక మేర కు ప్రభుత్వం రూ.35 కోట్ల మేరకు మంజూరు చేయడంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ప్రతి వార్డుకు రూ.1.50 కోట్ల మేరకు నిధులు కేటాయించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధ్దంగా ఉందని చెప్పారు. అలాగే పట్టణం, తండాలకు అవసరమైన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను మంజూరు చేసేందుకు సిద్ధ్దంగా ఉన్నామని చెప్పారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన వర్ధన్న పేట ప్రజలకు ఎన్ని ఇళ్లు అవసరమైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఇల్లు కట్టుకునే వారికి రూ.5.50 లక్షల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు.

కాళేశ్వరంతో సస్యశ్యామలం..

గోదావరి నదిపై ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజె క్టు ద్వారా రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. గత వానకాలం, ప్రస్తుత యాసం గి పంటలకే సాగునీరు చెరువుల ద్వారా అందడంతో పెద్ద ఎత్తున రైతులు వరి, మెట్ట పంటలను సాగు చేసుకుంటున్నారన్నారు. రానున్న రోజుల్లో వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని అన్ని చెరువులకు గోదావరి జలాలను మళ్లించి పూర్తిస్థాయిలో పంటలు పండించేలా నీటిని తరలించడం జరుగుతుందని చెప్పారు. ఎస్సారెస్పీ గతంలో ఏడాదిలో 15 రోజులు పారితే ఎక్కువ అయ్యేదన్నారు. కానీ ప్రస్తుతం గత మూడు నెలలుగా నిరాటంకంగా ఎస్సారెస్పీలో గోదావరి జలాలు పారుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో 365 రోజులు ఎస్సారెస్పీ ద్వారా గోదావరి జలాలను తరలించి రైతుల పంట పొలాలను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.

12 వార్డులలో గెలవాలి..

నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డులలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందాలని మంత్రి కోరారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన వర్ధన్నపేటలో మూడుసార్లు ప్రజలు గెలిపించారని గుర్తు చేసుకున్నారు. పాలకుర్తిలో రెండుసార్లు గెలిచిన తనకు సీఎం కేసీఆర్‌ మంత్రి పదవి ఇచ్చి గౌరవించారన్నారు. ఈ గౌరవం వర్ధన్నపేట ప్రజలకే దక్కుతుందని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నిల్లో అన్ని వార్డులలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిస్తేనే తనకు, ఎమ్మెల్యే రమేశ్‌కు మరింత గౌరవం పెరుగుతుందని చెప్పారు. ప్రజలు కూడా నిస్వార్ధంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని దయాకర్‌రావు కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారామ్‌నాయక్‌, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, మార్నేని రవీందర్‌రావు, ఇండ్ల నాగేశ్వర్‌రావు, అప్పారావు, మార్గం భిక్షపతి, లలితాయాదవ్‌, పార్టీ రాష్ట్ర, జిల్లా బాధ్యు లు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.


logo