అజేయ శక్తిగా టీఆర్ఎస్

- -అభివృద్ధిని చూసే వలసలు
- -ప్రజాదరణ కోల్పోయిన ప్రతిపక్షాలు
- -పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- -గులాబీ కండువా కప్పుకున్న కొలన్‌పల్లి కాంగ్రెస్ నాయకులు
రాయపర్తి, జనవరి 17 : తిరుగులేని అజేయ శక్తిగా టీఆర్ఎస్ పార్టీ క్రమక్రమంగా ఎదుగుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. శుక్రవారం మండలంలోని కొలన్‌పల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తిరుమల రంగాచార్యుల నేతృత్వంలో గ్రామానికి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా పర్వతగిరిలోని మంత్రి ఎర్రబెల్లి నివాసం లో దయాకర్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరుతున్న వారందరికీ గులాబీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించిన అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజల ఆశలు, ఆకాంక్షలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని, తెలంగాణ ప్రజలందరి మనోభీష్టాలను నెరవేర్చేందుకు అలుపెరుగని పోరాటాలు చేసిన గులాబీ పార్టీలోనే చేరాలనే ఆలోచన రాష్ట్రంలోని ప్రజలందరిలో వచ్చిందని ఆయన వివరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని సకల వర్గాల ప్రజలంతా తాము కూడా టీఆర్ఎస్ పార్టీలో భాగస్వాములు కావాలనే తలంపుతో ముందుకు వస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రజల ఆధరణను కోల్పోయిన ప్రతిపక్ష పార్టీలకు రాష్ట్రంలో చోటు కోల్పోయాయని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీలో చేరిన కార్యకర్తలు, నాయకులందరినీ తాను అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తోట సుదర్శన్, వంగాల నర్సయ్య, గజ్జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్
- రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణకు చర్యలు