శుక్రవారం 15 జనవరి 2021
Warangal-rural - Jan 15, 2020 , 02:54:11

ఘనంగా జాతరలు

ఘనంగా జాతరలు


సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు ఆలయాల్లో జాతరలు కొనసాగుతున్నాయి. మంగళవారం దామెర మండలం ఊరుగొండలో లక్ష్మీనర్సింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, రాయపర్తి మండలం సన్నూరులోని వేంకటేశ్వరాలయంలో గోదారంగనాథుల తిరు కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. అంతేకాకుండా శాయంపేట మండలంలోని శ్రీమత్స్యగిరి స్వామి ఆలయం, వేంకటేశ్వరాలయం, గీసుగొండలోని లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం, ఖానాపురం మండలంలోని బుధరావుపేట వేంకటేశ్వరాలయం, అశోక్‌నగర్‌ కోదండరామాలయంలో కూడా గోదారంగనాయకుల కల్యాణోత్సవం నిర్వహించారు. కాగా, చెన్నారావుపేట మండలం లింగగిరిలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర ఘనంగా కొనసాగుతోంది. భోగిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌