ఎన్నికల కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలి

పరకాల, నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ టీకే శ్రీదేవితో కలిసి కలెక్టర్లు, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్లు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుకున్నందున అభ్యర్థుల జాబితా ఖరారు తరువాత బ్యాలెట్ పేపర్ ముద్రణ వంటి ఏర్పాట్లు సకాలంలో పూర్తిచేసుకోవాలన్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుని పరివీలించిన తరువాతే ముద్రణ చేయాలన్నారు. పోలింగ్ సిబ్బందికి రెండో విడత శిక్షణ నిర్వహించాలని, పోలింగ్ నిర్వహణకు తగిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కౌంటింగ్ సిబ్బందిని నియమించి త్వరలోనే శిక్షణ నిర్వహించాలన్నారు. మోడల్ కోడ్, ఎన్నికల వ్యయ నియంత్రణ, అమలు కోసం ఫ్లయింగ్ స్కాడ్ టీంలు, ఎస్ఎస్టీ, వీఎస్టీ బృందాలు, అకౌంటింగ్ టీంలు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించేలా చూడాలని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ కౌంటర్, రిసెప్షన్ కౌంటర్, కౌంటింగ్ కేంద్రాల్లో ఇతర ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన నివేదికలను సకాలంలో పంపించాలని, సరిపడా డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని చెప్పారు. బందోబస్తు ప్లాన్ ప్రకారం భద్రతా చర్యలను చేపట్టాలన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద ఇద్దరు కానిస్టేబుల్ ఆఫీసర్లను నియమించాలని చెప్పారు. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్, డిఆర్సీలు, కౌంటింగ్ ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్పెషల్ అధికారులు ప్రతిరోజు మున్సిపాలిటీ కార్యాలయంలోనే ఉంటూ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ నెల 17వ తేదీన సిబ్బందికి శిక్షణ కార్యక్రమం పెట్టామని, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో ఎస్సైతోపాటు మరికొందరు పోలీసు సిబ్బందికి విధులను అప్పగించామని తెలిపారు. వెబ్‌కాస్టింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో హరిసింగ్, ఆర్డీవోలు కిషన్, మహేందర్‌జీ, ఎలక్షన్ వింగ్ సూపరింటెండెంట్ విశ్వనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఉర్దూ పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల
- ర్యాలీలో అపశృతి.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి
- డైరెక్టర్ సాగర్ చంద్రనా లేదా త్రివిక్రమా..? నెటిజన్ల కామెంట్స్
- భూమిపై రికార్డు వేగంతో కరుగుతున్న మంచు
- బుద్ధిలేనోడే ఆ ఆల్‌రౌండర్‌కు రూ.10కోట్లు చెల్లిస్తారు!
- రైతుల హింసాత్మక ర్యాలీపై హోంశాఖ అత్యవసర సమావేశం
- అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
- యువతిపై గ్యాంగ్ రేప్..
- అమెరికా తొలి మహిళా ఆర్థిక మంత్రిగా జానెట్ యెల్లెన్!
- ‘కిసాన్ ర్యాలీలో అసాంఘిక శక్తులు’