బుధవారం 20 జనవరి 2021
Warangal-rural - Jan 14, 2020 , 03:33:25

సమాజసేవలో ముందుండాలి

సమాజసేవలో ముందుండాలి
  • - రోటరీక్లబ్‌జిల్లా గవర్నర్‌ శివన్నారాయణ

నర్సంపేట,నమస్తేతెలంగాణ: సమాజ సేవలో రోటరీక్లబ్‌ ముందు నిలవాలని క్లబ్‌జిల్లా గవర్నర్‌ శివన్నారాయణ అన్నారు. సోమవారం నర్సంపేట రెడ్డిఫంక్షన్‌హాల్‌లో రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు కోమండ్ల భూపాల్‌రావు అధ్యక్షతన సమావేశం జరిగింది.  ఈ సమావేశానికిఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛంద సేవతోనే మంచి గుర్తింపు వస్తుందని ఆయన తెలిపారు. క్లబ్‌ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. మరిన్ని కార్యక్రమాలను నిర్వహించి ముందుకు వెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో క్లబ్‌ ప్రధాన కార్యదర్శి పాలెల్లి వరణ్‌కుమార్‌, మామిడాల సతీశ్‌, గోపు జైపాల్‌రెడ్డి, కంది గోపాల్‌రెడ్డి, రాదారపు సాంబరెడ్డి, చకిలం కృష్ణమూర్తి, మోతె జైపాల్‌రెడ్డి, నామాల సత్యనారాయణ, సిద్ధ సుధాకర్‌, కామిడి సతీశ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కట్కూరి జైపాల్‌రెడ్డి, తుమ్మలపెల్లి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo