లింగగిరి గుట్టపై ఆలయం మహాద్భుతం

చెన్నారావుపేట, జనవరి12 : లింగగిరి గుట్టపై నిర్మించిన శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం మహాద్భుతం అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. ఆదివారం రాత్రి మండలంలోని లింగగిరిలో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి మహాజాతర మహోత్సవాల్లో భాగం గా రెండో రోజు ఆలయ ద్వితీయ వార్షికత్సవం ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మెన్ ఆకుల శ్రీనివాస్, ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్‌రెడ్డితో కలిసి ఆమె శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గండ్ర జ్యోతి మాట్లాడుతూ భకి ్తభావంతో మనసుకు ప్రశాంతత లభిస్తుందన్నారు. లింగగిరిలో దొడ్డ మోహన్‌రావు రూ.2కోట్లతో గుడిని నిర్మించడం అభినందనీయన్నారు. ఆయన ఇదే గ్రామానికి చెందినవాడు కావడం గ్రామస్తులకు వరమని కొనియాడారు.
అలరించిన కాకి పడగల కథాగానం
తెలంగాణలో ప్రాచీన కళలకు వన్నె తెస్తున్న రెడ్డబోయిన భీముడు బృందం సభ్యులు కాకి పడగల కళారూపం నవలోక కల్యాణం కథాగానం అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకం పలువురిని ఆకట్టుకుంది. గండ్ర జ్యోతి, ఆకుల శ్రీనివాస్, పెద్ది స్వప్నతో పాటు పలువురు ఆసక్తిగా తిలకించారు. అలాగే, జోర్దార్ సుజాత యాంకరింగ్ పలువురిని ఆకట్టుకుంది. అనంతరం ముఖ్యఅతిథులకు దొడ్డ మోహన్‌రావు ఎర్రచందనం మొ క్కలను అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, కోలాటా లు ఆకట్టుకున్నాయి. గుట్టపై ఆల యం విద్యుత్ వెలుగులతో జిగేల్‌మంటోంది. కార్యక్రమంలో ఎం పీపీ బాదావతు విజేందర్, జెడ్పీటీసీ బానోతు పత్తినాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న, సర్పంచ్ మాదారపు భాస్కర్, ఎంపీటీసీ పర్కాల లక్ష్మి, రాజన్న, నెక్కొండ ఎంపీపీ జాటో తు రమేశ్, పార్టీ మండల అధ్యక్షులు సంగని సూర య్య, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, మాజీ జెడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, శశికుమార్, కిరణ్‌కుమార్, ఉపసర్పంచ్ బూర్గు రాజశేఖర్, బోడ మాణిక్యం తండా సర్పంచ్ బోడ ఆనంద్, మెడబోయిన కుమారస్వామి, బూర్గు సూరయ్య, రాకం సాంబయ్య, మంద యాకాంబ్రం పాల్గొన్నారు.
ఊరుగొండలో..
దామెర : మండలంలోని ఊరుగొండ శ్రీలక్ష్మీనర్సింహాస్వామి బ్రహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉద యం స్వామివారికి ప్రాబోదిక పూజలు చేసి వైభవంగా బిందె తీర్థం నిర్వహించారు. అనంతరం ప్రధానార్చకులు తూపురాణి శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో ప్ర త్యేక పూజలు చేశారు. అర్చకులు శ్రీనివాసా చార్యులు, వినయకుమారాచార్యులు, బాలకృష్ణమాచార్యులు, జయకృష్ణమాచార్యులు, రమణాచార్యులు, సర్పంచ్ గోగుల సత్యనారాయణ రెడ్డి, బొల్లు రాజు, ముప్పు రామస్వామి, ఒడిదోలు మల్లయ్య, రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ జక్కుల రాణి, రవీందర్ పాల్గొన్నారు.
గీసుగొండలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
గీసుగొండ : మండలంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉదయం నుంచి స్వామి వారికి అర్చకులు వెంకటా నర్సింహచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు తదితరులు స్వామివారిని దర్శించుకుకొని పూజలు చేశారు. సాయంత్రం స్వామి వారిని ఉరేగింపుగా గ్రామంలోని ఆలయానికి తరలించారు.
నాచినపల్లి ఆలయంలో కల్యాణోత్సవం
దుగ్గొండి : మండలంలోని నాచినపల్లి శ్రీసీతారాంచంద్రస్వామి ఆలయంలో అర్చకుడు ఎదుగురి రమేశ్‌మూర్తి ఆధ్వర్యంలో శ్రీగోదారంగనాయకస్వామి కల్యా ణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సం ఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం టీ టీడీ ఆధ్వర్యంలో గోమాతకు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బొమ్మినేని శ్రీనివాస్‌రెడ్డి, జంగ జనార్దన్‌రెడ్డి, కటకం రాంచంద్రు, రాంరెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- 23న ఎఫ్‌టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం..
- శింబును వెలేసిన నిర్మాతల మండలి..?
- వేరుశనగ క్వింటాల్ @ రూ.7,712
- లైంగిక దాడి కేసులో వ్యక్తి 27 ఏళ్లు జీవిత ఖైదు
- ఈ 31లోపు అర్హులైన అందరికీ పదోన్నతులు : వి. శ్రీనివాస్ గౌడ్
- మీరారాజ్‌పుత్ హొయలు చూడతరమా..!
- ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం
- ముందే కరోనా కట్టడిలో చైనా ఫెయిల్!
- కుల్సుంపురాలో బాలిక అదృశ్యం
- మధ్యప్రదేశ్‌లో ‘తాండవ్’పై బ్యాన్ విధిస్తాం