శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Jan 13, 2020 , 04:02:32

పేదలకు అండగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌

పేదలకు అండగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌
  • - ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, జనవరి 12 : ఆర్థికంగాలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆపదలో అండ గా నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన 48 మం ది లబ్ధిదారులకు రూ.48.33లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఇందులో భాగంగానే మండలంలోని నల్లబెల్లి గ్రామానికి చెందిన బాధితులకు చెక్కు లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించని బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఆపరేషన్లు చేయించుకున్న పేదలకు వర్తించకపోయినట్లయితే ఆస్పత్రుల్లో తప్పకుండా ఒరిజినల్‌ బిల్లులు తీసుకోవాలని ఆయన సూచించారు. నిబంధనల ప్రకారం తప్పకుండా పేదలకు తనవంతు సహకారంతో పరిహారం అందించనున్నట్లు అరూరి చెప్పారు. కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


పర్వతగిరి : మండలంలోని కొంకపాకకు చెందిన తక్కళ్లపెల్లి శ్రీదేవి ఆస్పల్ల్రో చికిత్స చేయించుకోగా రూ.54 వేలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మంజూరయ్యాయి. ఆచెక్కును ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో సీఏ కొయ్యల రాజుగౌడ్‌, టీ మధుసూదన్‌రావు తదితరులున్నారు.logo