‘శుభనందిని’లో రమణీయమైన ప్రకృతి

హసన్‌పర్తి, జనవరి 12 : శుభనందిని వెంచర్లో రమణీయమైన ప్రకృతిని ఆస్వాదించవచ్చని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. మండలంలోని దేవన్నపేట, మడిపల్లి గ్రామాల మధ్య నూతనంగా శుభనందిని హోమ్స్ ఫేజ్-2 వెంచర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవన్నపేట నుంచి మడిపల్లి రోడ్లో గల కుడా అప్రూవల్ లేఆవుట్ డీపీ.నెం.61/2019 శుభనందిని సెకండ్ ఫేజ్ వెంచర్‌ను ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఆధునిక హంగులతో చక్కటి సీసీ రోడ్ల నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. ఇప్పటికే ఈ వెంచర్లో 60 శాతం ప్లాట్లు బుక్ చేసుకోవడం సంతోషదాయకమన్నారు. అనంతరం రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు మాట్లాడుతూ ట్రైసిటీలో ఇంత అద్భుతమైన వెంచర్‌ను చూడలేదని కొనియాడారు. శుభనందిని వెంచర్ చైర్మన్ కౌడగాని రాంబాబు మాట్లాడుతూ శుభనందిని గ్రూప్స్ ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేసి, ఈ వెంచర్‌ను మార్కెట్‌కి తీసుకొచ్చినట్లు తెలిపారు. విల్లాస్ కూడా బుక్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో శుభనందిని హోమ్స్ ఎల్ రాజేందర్, రాజాబాబు, రాజుకుమార్, అశోక్, రాజు, కుమారస్వామి, కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు దేవునూరి అంజయ్య, ఓదేలు, భూపాల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- వాట్సాప్‌కు భారత ప్రభుత్వం వార్నింగ్
- ఇదీ మా సత్తా: విరాట్ కోహ్లి
- అక్కడ మంత్రి కావాలంటే ఎన్నికల్లో గెలువాల్సిన పనిలేదు..
- ముంబై, పుణెలో ప్రారంభమైన వ్యాక్సిన్ డ్రైవ్
- చిరంజీవి నన్ను చాలా మెచ్చుకున్నారు..
- టీమిండియాకు 5 కోట్ల బోనస్
- టెస్ట్ చాంపియన్‌షిప్‌లో నంబర్ వన్ టీమిండియా
- టీమిండియాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు
- 1988 తర్వాత.. గబ్బా కోట బద్దలు
- అమ్మో! సూది మందా? నాకు భయ్యం..