శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Jan 12, 2020 , 04:03:27

సంక్రాంతి జాతరలు

సంక్రాంతి జాతరలు
  • -లింగగిరిలో ప్రారంభమైన లక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవాలు
  • -భారీగా తరలివచ్చిన భక్తులు
  • -పూజలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
  • -గీసుగొండ, ఊరుగొండలో కొనసాగుతున్న జాతర బ్రహ్మోత్సవాలు

చెన్నారావుపేట, జనవరి 11 : భక్తి భావంతోనే మనసు ప్రశాంతంగా ఉంటుందని  ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం రాత్రి మండలంలోని లింగగిరి గ్రామంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి మహాజాతర మహోత్సవాలను ఆయన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్ర తి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలన్నారు.  అప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త దొడ్డ మోహన్‌రావు లింగగిరి గ్రామంలో గుట్టపై రూ.2కోట్లతో గుడి నిర్మాణ పనులు చేపట్టడం అభినందనీయన్నారు.  సొంత ఖర్చుతో వారం రోజుల పాటు జాతర  నిర్వహించడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.  దొడ్డ మోహన్‌రావు అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. కాగా, జాతర సందర్భంగా మొదటి రోజు ప్రపంచ ప్రసిద్ధ కళాకారుడు, హంస అవార్డు గ్రహీత, కళారత్న గడ్డం సమ్మయ్య బృందం చిందు యక్షగానం(కీచక వధ)నాటకాన్ని ప్రదర్శించారు.

మంత్రి, ఎమ్మెల్యేతోపాటు జెడ్పీఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న, పలువురు ప్రజాప్రతినిధులు ఆసక్తిగా తిలకించారు. టీవీ యాంకర్‌ జోర్ధార్‌ సుజాత పలువురిని ఆకట్టుకుంది. అనంతరం మంత్రి, ఎమ్మెల్యేకు దొ డ్డ మోహన్‌రావు ఎర్రచందనం మొక్కలను అం దించి శాలువాలు కప్పి  సన్మానించారు. తర్వాత ట్రాక్టర్లను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ పీ బాదావతు విజేందర్‌, జెడ్పీటీసీ బానోతు పత్తినాయక్‌, వైస్‌ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న, సర్పంచ్‌ మాదారపు భాస్కర్‌, ఎంపీటీసీ పర్కాల లక్ష్మీ, రాజన్న, మండల కోఆప్షన్‌ సభ్యులు ఎంఏ గఫా ర్‌, ఎంపీడీవో చందర్‌, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌ నబీ, నెక్కొండ ఎంపీపీ జాటోతు రమేశ్‌, మారం రాము, చెన్నారావుపేట సర్పంచ్‌ కుండె మల్లయ్య, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ బుర్రి తిరుపతి, మాజీ జెడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, శశికుమార్‌, కిరణ్‌కుమార్‌, ఉపసర్పంచ్‌ బూర్గు రాజశేఖర్‌, మెడబోయిన కుమారస్వామి, బూ ర్గు సూరయ్య పాల్గొన్నారు.

కొనసాగుతున్న జాతర

నర్సంపేట, నమస్తే తెలం గాణ/దామెర/గీసుగొండ /రాయపర్తి/దుగ్గొండి  దామెర మండలం ఊరుగొండ, గీసుగొండలోని లక్ష్మీనరసింహస్వామి జాతర కొనసాగుతోంది. ఊరుగొండలో  శనివారం రాత్రి  కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.   గీసుగొండలో భక్తులు మొక్కులు సమర్పించారు.   రాయపర్తి మండలంలోని సన్నూరులో కూడారై ఉత్సవాలు నిర్వహించారు.  నర్సంపేట వేంకటేశ్వరాలయం,    దుగ్గొండి మండలం నాచినపల్లిలోని శ్రీసీతారాంచంద్రస్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో గోపూజలు నిర్వహించారు.