ఆదివారం 24 జనవరి 2021
Warangal-rural - Jan 12, 2020 , 04:01:55

బాల వికాస సేవలు అభినందనీయం

బాల వికాస సేవలు అభినందనీయం
  • -అమీన్‌పేట వాటర్‌ప్లాంటును ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
  • -సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరు

నెక్కొండ, జనవరి 11 : మండలంలోని అమీన్‌పేటలో బాలవికాస ఆధ్వర్యంలో ఏర్పాటును చేసిన మినరల్‌వాట ర్‌ ప్లాంటును ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. అమీన్‌పేట సర్పంచ్‌ గరికపాటి హన్మంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మా ట్లాడుతూ బాలవికాస స్వచ్ఛంద సంస్థ రక్షిత మంచినీటిని అందించేందుకు రెండు తెలుగు రాష్ర్టాల్లో యెనలేని సేవలను అందిస్తున్నాయని, బాలవికాస స్వచ్ఛంద సంస్ధ సేవ లు అభినందనీయమన్నారు. అమీన్‌పేట గ్రామం పల్లె ప్రగతిలో ముందుకు దూసుకుపోతోందన్నారు. ప్రభుత్వం అం దిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ సర్పంచ్‌ ఆధ్వర్యంలో ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటోందన్నా రు. పనుల పురోగతిని దుష్ట్యా రూ.10 లక్షల నిధులను సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.  నెక్కొం డ మండలంలో అలంఖానిపేట, అమీన్‌పేటతోపాటు పల్లెపల్లెలు ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవడంలో పోటీపడుతున్నాయన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని అందుకున్న గ్రా మాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు కోటి రూపాయాలను మం జూరు చేస్తామని హమీనిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ రమేశ్‌, జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యులు అబ్దుల్‌నబీ, జెడ్పీటీసీ సరోజన, వైస్‌ ఎంపీపీ పుండరీకం, ఎంపీటీసీ దస్రు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, ఉపసర్పంచ్‌ ఎల్లయ్య, బాలవికాస అధికార ప్రతినిధి బాలమోహన్‌రెడ్డి, నాయకులు మారం రాము, దయాకర్‌, యాకుబ్‌, యాక య్య, స్రవంతి, పర్వీన్‌, అనిత తదితరులు పాల్గొన్నారు.


logo