మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Jan 09, 2020 , 19:21:18

హోంమంత్రి చేతుల మీదుగా మెడల్స్‌ అందుకున్న పోలీసులు

హోంమంత్రి చేతుల మీదుగా మెడల్స్‌ అందుకున్న పోలీసులు

రెడ్డికాలనీ, వరంగల్‌ చౌరస్తా: కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపిక చేయబడిన జిల్లా పోలీసు అధికారులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ మెడల్స్‌ను అందజేశారు. బుధవా రం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ అందుకున్న వారిలో ఆర్ముడ్‌ రిజర్వ్‌ విభాగం అదనపు ఎస్పీలు భీంరావు, గిరిరాజుతోపాటు స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సై మక్బూల్‌పాషా ఉన్నారు. అదేవిధంగా హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి మహోన్నత సేవా పతకాన్ని అందుకున్నారు. వరంగల్‌ ఇంతేజార్‌గంజ్‌ ఎస్సై రాందేని స్వామి తెలంగాణ పోలీస్‌ శౌర్య పతకాన్ని హోంమంత్రి మహమూద్‌ అలీ చేతులమీదుగా స్వీకరించారు. ఈ సందర్భంగా పతకాలు అందుకున్న అధికారులను పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌, కమిషనరేట్‌ పోలీసులు, సిబ్బంది అభినందించారు.


logo