శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Jan 09, 2020 , 19:20:13

భద్రకాళీని దర్శించుకున్న డాక్టర్‌ శ్రీనివాసరావు

భద్రకాళీని దర్శించుకున్న డాక్టర్‌ శ్రీనివాసరావు

మట్టెవాడ, జనవరి 08: వరంగల్‌ నగరంలో చరిత్ర ప్రసిద్ధ్దిగాంచిన శ్రీభద్రకాళీ దేవస్థానాన్ని హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు బుధవా రం సందర్శించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ప్రధానార్చకులు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో అర్చకులు , సిబ్బంది స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజ లు చేసిన అనంతరం శేషవస్ర్తాలను బహూకరించి తీర్థప్రసాదాలు అందజేశారు. డా క్టర్‌ శ్రీనివాసరావు వెంట జిల్లా వైద్యాధికారిణి డాక్టర్‌ లలితాదేవి, డాక్టర్‌ మనోహర్‌, హసన్‌, శ్యాం, సత్యనారాయణ, మాధవరెడ్డి, కిరణ్‌రెడ్డి ఉన్నారు.


logo