ఆత్మకూరు, జూలై 28: గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముచ్చ రాజిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన లయన్స్ క్లబ్ ఆత్మకూరు దేశాయ్ ద్వారా స్థానిక గ్రామ పంచాయతీకి బాడీఫ్రీజర్ను అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు టింగిళికారు సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామ పంచాయతీ స్థలాన్ని కేటాయిస్తే ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ద్వారా ఆత్మకూరులో నేత్ర వైద్యశాలను ఏర్పాటు చేస్తామన్నారు. సర్పంచ్ రాజు మాట్లాడుతూ నేత్ర వైద్యశాలకు కావాల్సిన రెండెకరాల స్థలాన్ని సేకరించి లయన్స్ క్లబ్‌కు అప్పగిస్తామన్నారు. ఉప గవర్నర్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ బాడీఫ్రీజర్ సేవలను ఆత్మకూరుతోపాటు సమీప గ్రామాలకు అందించేలా చూడాలన్నారు.
నేత్ర వైద్యశాల ఏర్పాటు చేస్తే తనవంతు సాయంగా లక్ష రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చారు. పీఏసీఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్‌గౌడ్ కంటి ఆస్పత్రికి తన తల్లి జ్ఞాపకార్థంగా రూ. 50 వేల విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రీజియన్ సెక్రటరీ డాక్టర్ విద్యాగౌతమ్ ఆధ్వర్యంలో రెండు వందల మందికి ఉచితంగా షుగర్ టెస్టులు చేశారు. కార్యక్రమంలో మూడో రీజియన్ చైర్మన్ జనగాం అంజిరెడ్డి, ఉపసర్పంచ్ వంగాల స్వాతీభగవాన్రెడ్డి, క్లబ్ ప్రధాన కార్యదర్శి రేవూరి దేవేందర్‌రెడ్డి, కోశాధికారి నాగబండి శివప్రసాద్, పావనీరవీందర్, క్లబ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.