e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home జనగాం సొసైటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..

సొసైటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..

ఖానాపురం, సెప్టెంబర్‌ 30 : ఖానాపురం సొసైటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలుపుతానని ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోత్‌ రామస్వామినాయక్‌ అన్నారు. గురువారం మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సాధారణ మహాసభ ని ర్వహించారు. మొదట చైర్మన్‌తో పాటు సీ ఈవో ఆంజనేయులు ప్రగతి నివేదికలను చ దివి వినిపించారు. సంఘం అభివృద్ధికి పా లకవర్గ సభ్యులు, రైతుల నుంచి సలహాలు స్వీకరించారు. దబీర్‌పేట భూములకు హ క్కు పత్రాలు కల్పించి రుణసౌకర్యం కల్పించాలని, రైతుబంధు వర్తింపజేయాలని పలువురు రైతులు కోరారు. సొసైటీ ఖాళీ స్థలా ల్లో కాంప్లెక్స్‌లు, గోదాముల నిర్మించాలన్నా రు. ఆయిల్‌ పామ్‌ సాగు చేసేందుకు రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం చైర్మన్‌ మాట్లాడుతూ.. అందరి సహకారం తో సొసైటీని జిల్లాలో ప్రథమ స్థానంలో ని లిపామన్నారు. వానకాలం ధాన్యం కొనుగోళ్లకు బాలుతండాలో, బండమీదిమామిడితండాలో నూతనంగా కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు ధాన్యా న్ని రోడ్లపై ఆరబోస్తుండడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి ని వారణకు సర్పంచ్‌లు గ్రామాల్లో స్థలాలు చూపితే సీసీ వేస్తామన్నారు. బుధరావుపేట, ధర్మారావుపేట, మంగళవారిపేట గ్రామాల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మిస్తామని తెలిపారు. ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ కుంచారపు వెంకట్‌రెడ్డి, తుంగబంధం కన్వీనర్‌ వేజళ్ల కిషన్‌రావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మహాలక్ష్మీ వెం కటనర్సయ్య, సొసైటీ వైస్‌చైర్మన్‌ దేవినేని వే ణుకృష్ణ, డైరెక్టర్లు రవీందర్‌రావు, రమేశ్‌, ల క్ష్మణ్‌, కుమారస్వామి, తిరుపతి, రాజు, సు నీత, ఎంపీటీసీలు సుభాన్‌భీ, మౌలానా, భారతి, విజయాకర్‌రావు, ఫూల్‌సింగ్‌, పులిగిళ్ల యాదగిరిరావు, చెల్పూరి శ్రీనివాస్‌, రా మగిరి రాజేశ్‌, కొండి రాము పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement