e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home జనగాం ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

  • పరారీలో మరో నిందితుడు
  • రూ. లక్షా 60 వేల నగదు, 8 నకిలీ ఏటీఎం కార్డులు, 2 మారుతీ కార్లు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్‌ జోషి

జనగామ చౌరస్తా, జూలై 28 : ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేయడం తెలియని అమాయకులను మా టల్లోకి దింపి కార్డులను మార్చి డబ్బులు డ్రా చేసుకుంటున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్షా 60 వేల నగదు, 8 నకిలీ ఏటీఎం కార్డులు, 2 మారుతీ కార్లు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జనగామ కలెక్టరేట్‌ ఆవరణలో వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషి వివరాలు వెల్లడించారు. ఏపీకి చెందిన కొమ్మరాజు వీర సాయికిరణ్‌(22), కటకం సాయికిరణ్‌ (23), ఇల్ల వెంకట సాయి కిరణ్‌(23), కొప్పిశెట్టి రాజ్‌కుమార్‌ (25) జల్సాలకు అలవాటు పడ్డారు. ఇందుకోసం సులువుగా డబ్బు లు సంపాదించడానికి ఏటీఎం సెంటర్లకు వచ్చే అమాయకులను టార్గెట్‌ చేశారు. ఏటీఎం సెంటర్లలో డబ్బు లు డ్రా చేయడానికి వచ్చే వారికి సాయం చేస్తున్నట్లు న మ్మించేవారు. తర్వాత వారిని మాటల్లోకి దింపి ఒరిజినల్‌ ఏటీఎం కార్డును కొట్టేసి, నకిలీ ఏటీఎం కార్డును వారికి ఇచ్చేవారు. అప్పటికే వీరు తెలుసుకున్న పిన్‌ నంబర్‌తో మరో ఏటీఎం సెంటర్‌లోకి వెళ్లి సదరు వ్యక్తి అకౌంట్‌లో ఉన్న నగదు మొత్తాన్ని డ్రా చేసేవారు. అ లా వచ్చిన డబ్బులతో కార్లలో తిరుగుతూ లగ్జరీ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. గత నెల జూన్‌ 23న చిల్పూరు మండలం చిన్న పెండ్యాలలోని ఏటీఎం సెంటర్‌కు వ చ్చిన ఓ వ్యక్తి నుంచి కార్డు దొంగిలించి రూ. 40 వేలు డ్రా చేశారు.

ఇదే తరహాలో సిద్దిపేట రోడ్డులోని ఓ ఏటీ ఎం సెంటర్లో మహిళ నుంచి కార్డు, పిన్‌ నంబర్‌ దొంగిలించి రూ. 70 వేలు కాజేశారు. ఈ నెల 13వ తేదీన నర్సంపేటలో రూ. 25 వేలు డ్రా చేశారు. కాగా, ఈ నలుగురు నిందితులపై ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. బుధవారం జనగామలోని నెహ్రూపార్కు సమీపంలోని ఓ ఏటీఎం సెంటర్‌ వద్ద తచ్చాడుతున్న కొమ్మరాజు వీర సాయికిరణ్‌, కటకం సాయికిరణ్‌, ఇల్ల వెంకట సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కొప్పిశెట్టి రాజ్‌కుమార్‌ పరారీలో ఉన్నాడని సీపీ పేర్కొన్నారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చిన జనగామ డీసీపీ బీ శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ పుష్ప, స్టేషన్‌ ఘనపూర్‌ ఏఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌, క్రైం ఏసీపీ బాబురావు, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు రమేశ్‌ కుమార్‌, శ్రీనివాసరావు, జనగామ అర్బన్‌ సీఐ పీ బాలాజీ వరప్రసాద్‌, అసిస్టెంట్‌ అనాలిటికల్‌ ఆఫీసర్‌ సల్మాన్‌ పాషా, ఐటీ కోర్‌ టీమ్‌ ప్రవీణ్‌ కుమార్‌, సీసీఎస్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు రవికుమార్‌, జంపయ్య, రవీందర్‌రెడ్డి, కృష్ణ, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్‌, విశ్వేశ్వర్‌, నరసింగరావు, మహేశ్వర్‌ను అభినందించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana