e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జనగాం ప్రైమరీ స్కూల్‌.. అడ్మిషన్స్‌ ఫుల్‌

ప్రైమరీ స్కూల్‌.. అడ్మిషన్స్‌ ఫుల్‌

  • 150మంది పిల్లలతో శాయంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల
  • జిల్లాలోనే టాప్‌
  • ఆంగ్లమాధ్యమంపై ఆదరణ.. పెరిగిన విద్యార్థుల సంఖ్య
  • ఆన్‌లైన్‌ బోధన సమయంలో వాట్సాప్‌
  • గ్రూపులు, వర్క్‌షీట్లతో దగ్గరైన ఉపాధ్యాయులు

శాయంపేట, సెప్టెంబర్‌ 20 : ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, ఆంగ్లంలో విద్యాబోధన, ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధ.. వెరసి ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ఇటీవల పాఠశాలలు పునఃప్రారంభంకాగా, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులు అధిక సంఖ్యలో చేరుతున్నారు. శాయంపేట ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆంగ్లం లో బోధన జరుగుతున్నది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 150 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మండలంలోనే కాకుండా జిల్లా స్థాయిలో ఎకువ సంఖ్యలో పిల్లలు ఉన్న ప్రైమరీ పాఠశాలగా గుర్తింపు సాధించింది. ఇక్కడ హెచ్‌ఎంతో పాటు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. కరోనాకు ముందు పాఠశాలలో 131 మంది విద్యార్థులు అభ్యసించగా ఇప్పుడా సంఖ్య పెరిగింది. ఒకటో తరగతిలో 18 మంది, 2లో 23 మంది, 3వ తరగతిలో 29 మంది, 4వ తరగతిలో 34 మంది, 5వ తరగతిలో 40 మంది విద్యార్థులు చదువుతున్నట్లు ఉ పాధ్యాయులు తెలిపారు. తరగతి గదుల్లో లైట్లు, ఫ్యా న్లు, వెలుతురు వచ్చే ఏర్పాట్లు చేశారు.

వాట్సాప్‌ గ్రూపులతో పర్యవేక్షణ..
ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి ఫోన్‌ నంబర్‌ సేకరించి వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఆన్‌లైన్‌ క్లాసుల షెడ్యూల్‌ పంపి ఫోన్లు చేసి సమాచారమిచ్చారు. విద్యార్థులకు వర్క్‌షీట్లు అందించి ఇంటింటికీ వెళ్లి వారి సందేహాలను తీర్చారు. ప్రైమరీ, హైసూ ల్‌ ఒకే ఆవరణలో కొనసాగుతుండగా, మరో రెండు తరగతి గదులు అవసరమని టీచర్లు చెబుతున్నారు.

- Advertisement -

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య
కమలాపూర్‌ : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని పెద్దపల్లి జిల్లా పెగడపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు చేరాల రాంబాబు అన్నారు. త మ పిల్లలను కమలాపూర్‌ ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. కూతుళ్లు చంద్రహాసిని ఐదో తరగతి, అనురాగ హాసినిని రెండో తరగతిలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. హెచ్‌ఎం సువర్ణ ఆయనను అభినందించారు.
ధర్మసాగర్‌ : మండలలోని జానకీపురం సర్పంచ్‌ నవ్య తన ఇద్దరు పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలలో చేర్పించారు. ఈ మేరకు ఆమెను సర్పంచ్‌లు అభినందించారు.

మూతబడిన బడులు తెరుచుకున్నాయి..
విద్యార్థుల లేక మూడు సంవత్సరాల క్రితం మూ తపడిన మండలంలోని నూర్జహాన్‌పల్లి, కొప్పుల ప్ర భుత్వ ప్రాథమిక పాఠశాలలు మళ్లీ తెరుచుకున్నా యి. ఇటీవల పాఠశాలల పునఃప్రారంభం తర్వాత నూర్జహాన్‌పల్లి పాఠశాలలో 15మంది, కొప్పుల ప్రై మరీ సూల్లో 9మంది విద్యార్థులు అడ్మిషన్లు పొం దారు. మండలంలో 37పాఠశాలల్లో విద్యార్థుల సం ఖ్య రెండు వేలకుపైగా ఉన్నట్లు టీచర్లు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement