e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home జనగాం పేదలను ఆదుకోవడం అభినందనీయం

పేదలను ఆదుకోవడం అభినందనీయం

ట్రైసిటీ ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ గౌరవ
అద్యక్షుడు మైసారపు సిరిల్‌ లారెన్స్‌

కాజీపేట, ఆగస్టు 1: ప్రపంచ ఆటో డ్రైవర్స్‌ దినోత్సవం సందర్భంగా పేదలను ఆదుకోవడం అభినందనీయమని ట్రైసిటీ ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ గౌరవ అద్యక్షుడు మైసారపు సిరిల్‌ లారెన్స్‌ అన్నారు. కాజీపేట రైల్వే జంక్షన్‌ ప్రాంగణంలో ట్రైసిటీ ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ అద్యక్షుడు బండి రాంచందర్‌ ఆధ్వర్యంలో అనాథలకు భోజనం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఆటో కార్మికులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌అండగా ఉంటారని తెలిపారు. అనంతరం ఇటీవల మృతి చెందిన సంటి రాజయ్య కుటుంబానికి రూ. ఐదు వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్‌ నాయకులు సిలువేరు విజయ్‌భాస్కర్‌, బండి విజయ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, గుణాజు, కేశవులు, గోవర్ధన్‌, శ్రీను, సర్వర్‌, అజయ్‌కుమార్‌ నాగేశ్వర్‌రావు , శేఖర్‌, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

- Advertisement -

మడికొండలో ఆటోడ్రైవర్ల ర్యాలీ
మడికొండ : ప్రపంచ ఆటోడ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మడికొండలో ఆటోడ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆటోడ్రైవర్స్‌ యూనియన్‌ మడికొండ అధ్యక్షుడు మాచర్ల రాజ్‌కుమార్‌ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం నగరంలో జరిగిన సభకు బయలుదేరి వెళ్లారు. గాదెపాక కిరణ్‌, బరిగెల కృష్ణమూర్తి, ఎల్లాగౌడ్‌, గుజ్జుల తరుణ్‌, బానోత్‌ నాగేశ్‌, రాజ్‌కుమార్‌, రాజేందర్‌, సతీశ్‌, సుమన్‌, సురేశ్‌, సదానందం, వంశీ, హరీశ్‌, యాకన్న, కిరణ్‌ పాల్గొన్నారు.

ఆటోడ్రైవర్ల సేవలు మరువలేనివి
వేలేరు : ఆటోడ్రైవర్ల సేవలు మరువలేనివి ఎర్రబెల్లి గ్రామ ఉపసర్పంచ్‌ అల్లం సతీశ్‌ అన్నారు. ఎర్రబెల్లి గ్రామంలో ఆదివారం ప్రపంచ ఆటోడ్రైవర్ల దినోత్సవం సందర్భంగా ఆటోడ్రైవర్లను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడంలో ఆటోడ్రైవర్ల కృషి ఎనలేనదని పేర్కొన్నారు. గూడ రాజ్‌కుమార్‌, నరేందర్‌, భిక్షపతి, లెనిన్‌, పవన్‌, రవి, కిరణ్‌, సుమన్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana