e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home జనగాం న్యాయం ప్రతి ఒక్కరి హక్కు

న్యాయం ప్రతి ఒక్కరి హక్కు

  • చిన్నచిన్న గొడవలతో సమయాన్ని వృథా చేసుకోవద్దు
  • మహిళలు రుణాలను వినియోగించుకోవాలి
  • జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి,
  • సీనియర్‌ సివిల్‌ జడ్జి మహేశ్‌నాథ్‌
  • గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు

గీసుగొండ, సెప్టెంబర్‌ 17: న్యాయం ప్రతి ఒక్కరి హక్కు అని, దాన్ని అందరూ సమానంగా పొందాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి మహేశ్‌నాథ్‌ అన్నారు. కోనాయిమాకులలోని మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. చిన్నచిన్న గొడవల కారణంగా సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న రుణాలను వినియోగించుకొని మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు. సదస్సులో డీఆర్డీవో సంపత్‌రావు, డీపీఎం దయాకర్‌, ఏపీఎం సురేశ్‌కుమార్‌, ఎంపీడీవో రమేశ్‌, మండల సమాఖ్య అధ్యక్షురాలు నాగరాణి, వీవోలు పాల్గొన్నారు.

సదస్సులను వినియోగించుకోవాలి
నర్సంపేటరూరల్‌/చెన్నారావుపేట/నెక్కొండ/ఖిలావరంగల్‌, సెప్టెంబర్‌ 17: న్యాయ విజ్ఞాన సదస్సులను గ్రామీణ ప్రజలు వినియోగించుకోవాలని చెన్నారావుపేట ఎస్సై శీలం రవి అన్నారు. శుక్రవారం ముగ్ధుంపురం జీపీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్‌ పెండ్యాల జ్యోతి అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ న్యాయ విజ్ఞానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. రాజీ మార్గానికి మించింది మరొకటి ఉండదన్నారు. సదస్సులో ఎంపీటీసీ చీకటి స్వరూప, న్యాయవాదులు మోటూరి రవి, గూళ్ల ప్రభాకర్‌, పుట్టపాక రవి, చిలువేరు కిరణ్‌, కంసాని అశోక్‌, ఉప సర్పంచ్‌ చాందావత్‌ తిరుపతినాయక్‌, వార్డు సభ్యుడు పెండ్యాల సదానందం పాల్గొన్నారు. అలాగే, చెన్నారావుపేట మండలం లింగాపురంలో సర్పంచ్‌ తప్పెట రమేశ్‌ అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శీలం రవి హాజరై మాట్లాడుతూ పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

కార్యక్రమంలో నర్సంపేట కోర్టు లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సూపరింటెండెంట్‌ సుభాష్‌, న్యాయవాదులు మోటూరి రవి, పుట్టపాక రవి, చిలువేరు కిరణ్‌కుమార్‌, అశోక్‌, ఉపసర్పంచ్‌ వేములపెల్లి రాజ్‌కుమార్‌, కార్యదర్శి శ్వేత, ఇన్‌చార్జి హెచ్‌ఎం సురేశ్‌, వార్డు సభ్యులు బరిగెల రాములు, చిన్నాల విజయ, మేరుగు శంకర్‌లింగం, అజ్మీరా శ్రీను పాల్గొన్నారు. నెక్కొండ మండలంలోని పనికర, చంద్రుగొండలో న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహించారు. నర్సంపేట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్‌, ఎస్సై నాగరాజు, కోర్టు సూపరింటెండెంట్‌ ఈశ్వర్‌, లీగల్‌సెల్‌ న్యాయవాది సుభాష్‌ హాజరై చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వరంగల్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీవీ మహేశ్‌నాథ్‌ ఆటో డ్రైవర్లకు చట్టాలపై అవగాహన కల్పించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement