e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home జనగాం తెలంగాణ సర్కారులోనే అర్చకులకు సముచిత స్థానం

తెలంగాణ సర్కారులోనే అర్చకులకు సముచిత స్థానం

  • టీఎన్‌జీవోస్‌కు అనుబంధంగా అర్చక జేఏసీ
  • టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌

వరంగల్‌, ఆగస్టు 2 : తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే అర్చక ఉద్యోగులకు సముచిత స్థానం దక్కిందని టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ అన్నారు. సోమవారం వరంగల్‌ బట్టల బజార్‌లోని వేంకటేశ్వర ఆలయ కల్యాణ మండపంలో అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ అధ్యక్షతన జరిగిన అర్చక ఉద్యోగ జేఏసీ సర్వసభ్య సమావేశంలో ఆయన ము ఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అర్చక ఉద్యోగులు జేఏసీగా ఏర్పడడం ఆనందంగా ఉందన్నారు. అర్చక ఉద్యోగుల సమస్యలను గంగు ఉపేంద్రశర్మ అనేక సార్లు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన అర్చక ఉద్యోగ జేఏసీ టీఎన్‌జీవోస్‌కు అనుబంధమైందన్నారు. అర్చక ఉద్యోగులకు ప్రభుత్వ పే స్కేల్‌ వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. టీఎన్‌జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అర్చక ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ పీఆర్సీ ఇచ్చారని అన్నారు. నూతన పీఆర్సీ వర్తింపజేసేలా కృషి చేస్తామని అన్నారు. దేవాదాయ శాఖలోని పదోన్నతుల్లో అర్చక ఉద్యోగులకు న్యాయం చేయాలని, అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని గంగు ఉపేంద్ర శర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా 3 వేల మంది అర్చక ఉద్యోగులకు మాత్రమే వేతనం వస్తున్నదని, మిగతా 2625 మందికి కట్‌ఆఫ్‌డేట్‌ తొలగించి వేతనాలు ఇవ్వాలని ఆర్థిక శాఖకు కేబినెట్‌ సిఫారసు చేయడంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు తీర్మానాలను సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో రాష్ట్ర టీఎన్‌జీవోస్‌ ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమయ్య, కేంద్ర కమిటీ కార్యవర్గ సభ్యులు కోలా రాజేశ్‌గౌడ్‌, అర్చక జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రాచారి, ఉద్యోగ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ కొండూరి కృష్ణమాచారి, దిలీప్‌కుమార్‌ జోషి, వీరభద్ర శర్మ, రాజశేఖర్‌ శర్మ, రత్నాకర్‌, అనిల్‌కుమార్‌, రామలింగారాధ్య, సంజీవ్‌రావు, లంకా శివకుమార్‌ పాల్గొన్నారు.

‘ఈబీసీ రిజర్వేషన్ల’పై హర్షం
అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్‌ ఆమోదించడంపై సోమవారం హన్మకొండ బ్రాహ్మణవాడలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రూ.8లక్షలలోపు ఆదాయం కలిగిన అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌ వర్తింపజేయడం గొప్ప వరమని బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర నాయకులు శ్రీధరాచార్యులు, అవినాశ్‌రెడ్డి, ఆర్యవైశ్య నాయకుడు గోవిందరాజులు, మహిళానాయకులు సునీతారావు, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana