e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home జనగాం అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు

రాయపర్తి, జూలై 29 : మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తున్నట్లు ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని తిర్మలాయపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్‌ గజవెల్లి అనంత ప్రసాద్‌తో కలసి పలువురు లబ్ధిదారులకు కొత్తగా మంజూరయిన ఆహార భద్రతా కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సారధ్యంలో జిల్లాలో రాయపర్తి మండలాన్ని అభివృద్ధిలో అగ్రగ్రామిగా నిలిపేందుకు ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గిర్దావర్‌ భాస్కర్‌ల రాజు, మాజీ సర్పంచ్‌లు వశపాక కుమారస్వామి, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి రామోజు మమత, ఉప సర్పంచ్‌ గుడి యుగేంధర్‌రెడ్డి, సానిక విశ్వనాథం, గజవెల్లి విజయ్‌కుమార్‌, తిరుపతి, రేణుక, ఎనగందుల సత్తయ్య, గడ్డం విజయ్‌కుమార్‌, ఆలేటి వసంత, మహంకాళి రత్నాకర్‌, వశపాక అయిలయ్య, వశపాక యాకయ్య, మారయ్య, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నల్లబెల్లిలో..
నల్లబెల్లి : మండల పరిషత్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ పెద్ది స్వప్న లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. నిరుపేదలకు రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీత, ఎంపీడీవో విజయ్‌కుమార్‌, ఎంపీవో కూచన ప్రకాశ్‌, సర్పంచ్‌ నానెబోయిన రాజారాం, ఎంపీటీసీ బోల్ల శ్రీలత, కో ఆప్షన్‌ మెంబర్‌ ఎండీ నజీమా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana