e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home వరంగల్ సిటీ పేద కుటుంబాలను ఆదుకోవాలి

పేద కుటుంబాలను ఆదుకోవాలి

పేద కుటుంబాలను ఆదుకోవాలి
  • చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, ఎంపీ దయాకర్‌
  • కొనసాగుతున్న నిత్యావసర సరుకుల పంపిణీ

హన్మకొండ చౌరస్తా, జూన్‌ 8 : కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎంపీ పసునూరి దయాకర్‌ అన్నారు. మంగళవారం 7వ డివిజన్‌ బ్రాహ్మణవాడలో ట్రైసిటీలోని పేద ఆర్యవైశ్యులకు వరంగల్‌ అర్బన్‌ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు మునుగోడు రమేశ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తొనుపునూరి వీరన్న ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్‌, దయాకర్‌ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ముందుకు వచ్చి సాయం చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌, నాయకులు పులి రజినీకాంత్‌, చీకటి ఆనంద్‌, తాడిశెట్టి విద్యాసాగర్‌, శేషగిరిరావు పాల్గొన్నారు.

మున్సిపల్‌ కార్మికులకు..
హన్మకొండ అలంకార్‌ సమీపంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్‌ బోడ డిన్నా ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోడ డిన్నా మాట్లాడుతూ లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు స్నేహితుల సాయంతో అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో ఎవరైనా పేద కుటుంబాలు ఉంటే 98664 74735 నంబర్‌కు సమాచారం ఇస్తే సాయం చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పేర్ల మనోహర్‌, ఏ రమేశ్‌, జనగాని శంకర్‌, బొక్క అశోక్‌, సన్నీ, కార్తీక్‌ పాల్గొన్నారు.\

జేపీఎన్‌ రోడ్డులో ఫకీర్లకు..
వరంగల్‌ చౌరస్తా : లాక్‌డౌన్‌ కారణంగా పని లేక ఇబ్బందులు పడుతున్న ఫకీర్లకు వరంగల్‌ జేపీఎన్‌ రోడ్డులో టీఆర్‌ఎస్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా నాయకుడు రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నగరంలోని సుమారు 100 మంది ఫకీర్లకు 25 కిలోల బియ్యం, సరుకులు అందజేసినట్లు శ్రీహరి తెలిపారు.

ప్రేరణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో..
హన్మకొండ : బాలసముద్రంలోని నిరుపేదలు, కొవిడ్‌ బాధిత కుటుంబాలకు ప్రేరణ ఫౌండేషన్‌ అధ్యక్షుడు పీ ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రిటైర్డ్‌ డీఈవో చంద్రమోహన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త నిమ్మల శ్రీనివాస్‌, ప్రవీణ్‌కుమార్‌, శ్వేత, టీవీ అశోక్‌కుమార్‌, ఆర్థి సంపత్‌, అర్చన పాల్గొన్నారు.

నవ్యశ్రీ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో..
న్యూశాయంపేట : గ్రేటర్‌ 31వ డివిజన్‌ న్యూశాయంపేటలో నవ్వశ్రీ మహిళ వెల్పేర్‌ సోసైటీ వారి ఆధ్వర్యంలో తారస్‌, స్వస్తి వారి సహకారంతో పేదలకు 13 రకాల నిత్యావసర సరుకులను కార్పొరేటర్‌ మా మిండ్ల రాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో నవ్వశ్రీ మహిళా వెల్ఫేర్‌ సొసైటీ కోమేనేజర్‌ ప్రభాకర్‌, ఫీల్డ్‌వర్కర్స్‌ గీతాంజతి, మయూరి, గన్నారపు ప్రసాద్‌, ఆరెళ్లి కిరణ్‌, పిండి రాజ్‌కుమార్‌, ఎనబోతుల సతీశ్‌, ఆరెళ్లి ఆభిలాష్‌, పిండి హరీశ్‌, ఎ గణేశ్‌ పాల్గొన్నారు.

దండేపల్లిలో..
ఎల్కతుర్తి : మండలంలోని దండేపల్లి గ్రామంలో 31మంది కరోనా బాధితులకు వృక్ష ప్రసాద దాత జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సర్పంచ్‌ పుట్ట ప్రమీల, ఎంపీటీసీ బోయినపల్లి భవానీ, ఏఎస్సై ప్రకాశ్‌, పుట్ట ప్రతాప్‌, బోయినపల్లి దేవేందర్‌రావు, నవీన్‌రావు, కొంగ ప్రవీణ్‌, రమేశ్‌, స్వరూప, రాజమౌళి, విష్ణు, హరీశ్‌, ప్రభాస్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేద కుటుంబాలను ఆదుకోవాలి

ట్రెండింగ్‌

Advertisement