e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జిల్లాలు కరోనా నుంచి కాపాడుకుంటాం

కరోనా నుంచి కాపాడుకుంటాం

కరోనా నుంచి కాపాడుకుంటాం

ప్రజలకు అండగా ప్రభుత్వం
ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు నిరంతరం శ్రమిస్తున్నారు
గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌
మహబూబాబాద్‌, మే 16 : కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకుంటామని, ప్రభుత్వం అండగా ఉంటుందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. ఆదివారం ఉదయం ఆమె జిల్లాకేంద్రంలోని డాక్టర్స్‌ వీధి, కూరగాయల మార్కెట్‌, నెహ్రూ సెంటర్‌, ఇందిరాగాంధీ సెంటర్‌తోపాటు ప్రధాన కూడళ్లలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి పర్యటించారు. కరోనా కట్టడిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ..ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు సమన్వయంతో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ వెలుసుబాటు ఉన్న సమయం లో అత్యవసరమైతేనే బయటకు రావాలని, వచ్చి న పని చూసుకుని త్వరగా ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. సాధ్యమైనంత వరకు శుభకార్యాలకు వెళ్లకపోవడమే మం చిదన్నారు. జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ అడగ్గానే నిధులిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి మానుకోటను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందు కు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం పూర్తయితే వ్యాపారులు రోడ్లపై కూరగాయల అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ నరేందర్‌రెడ్డి, ఫ్లోర్‌ లీడర్‌ చిట్యాల జనార్దన్‌, తేళ్ల శ్రీను, రఘు పాల్గొన్నారు.
నేడు గార్లలో ఆక్సిజన్‌ బెడ్లు ప్రారంభం
గార్ల, మే 16 : పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం మండలంలో 30 పడకల దవాఖానను నిర్మించింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో దవాఖానలోని పై అంతస్తులో యుద్ధ ప్రాతిపదిక 20 ఆక్సిజన్‌ బెడ్లను సిద్ధం చేశారు. సోమవారం వాటిని మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రారంభించనున్నట్లు టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాధాకృష్ణ తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా నుంచి కాపాడుకుంటాం

ట్రెండింగ్‌

Advertisement