e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home జిల్లాలు మేమున్నామంటూ..

మేమున్నామంటూ..

మేమున్నామంటూ..

బాధిత కుటుంబాలకు స్నేహితుల భరోసా
ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న దాతలు
ఆర్థిక సాయం, నిత్యావసరాల పంపిణీ

నెక్కొండ, జూన్‌ 13: మండలంలోని మూడ్‌తండాకు చెందిన సీమ్లా ఇల్లు దగ్ధమైంది. బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ పెద్ది స్వప్న పరామర్శించి రూ. 5 వేల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఆమె వెంట ఎంపీపీ జాటోత్‌ రమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సంగని సూరయ్య, సర్పంచ్‌ దూడ భద్రమ్మ, ఉప సర్పంచ్‌ లింగం, నాయకులు శ్రీను, యాలాద్రి, సదానందం ఉన్నారు.
మున్నూరుకాపు సంఘం సభ్యులకు..
మండలంలో కరోనాతో మృతి చెందిన కాపు సంఘం సభ్యులకు మున్నూరుకాపు సంఘం నాయకులు ఆర్థికసాయం అందించారు. నెక్కొండకు చెందిన బజ్జురి శంకర్‌(మెకానిక్‌), అప్పల్‌రావుపేటకు చెందిన ఆర్‌ఎంపీ యాసం కుమార్‌ ఇటీవల కరోనాతో మృతి చెందారు. సంఘం అధ్యక్షుడు కోల జనార్దన్‌ ఆధ్వర్యంలో సభ్యులు బాధిత కుటుంబాలకు రూ. ఐదు వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి యాసం కుమారస్వామి, ఉపాధ్యక్షుడు పడాల రవికుమార్‌, కోశాధికారి బొల్లం రాములు, సహాయ కోశాధికారి సుంకరి ప్రసాద్‌, సభ్యులు యాసం బాలకిషన్‌, శ్రవణ్‌, నర్సయ్య పాల్గొన్నారు. మండలంలోని పెద్దకోర్పోలుకు చెందిన బీజేపీ నాయకుడు బొడ్డుపెల్లి వెంకటేశ్వర్లు మృతి చెందగా, బాధిత కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరామర్శించి రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట నాయకులు సింగారపు సురేశ్‌, ఎస్‌ ఐలయ్య, డీ వెంకన్న, ఖాజాపాషా, సంజీవ, యాకయ్య ఉన్నారు.
నిత్యావసర సరుకుల పంపిణీ
ఆత్మకూరు: మండలంలోని తిరుమలగిరికి చెందిన ముప్పారపు మధుకర్‌ ఇటీవల కరోనాతో మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఆర్టీఐ ఆర్గనైజేషన్‌ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు దూడం భాస్కర్‌ పరామర్శించారు. అనంతరం భాస్కర్‌ నెలకు సరిపడా నిత్యావసర సరుకులను మృతుడి కుటుంబానికి అందజేశారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు బయట తిరుగకుండా హోం క్వారంటైన్‌లో ఉండాలని భాస్కర్‌ కోరారు. ఆయన వెంట సర్పంచ్‌ రంపీస మనోహర్‌, వార్డు సభ్యులు ఉన్నారు. అలాగే, మధుకర్‌ కుటుంబాన్ని వైఎస్‌ఆర్‌ షర్మిల పార్టీ నాయకులు పరామర్శించారు. అనంతరం ఆర్థిక సాయం అందజేశారు. పరామర్శించిన వారిలో నాయకులు నాగెల్లి రాజు, సంగాల యిర్మియా, జన్ను విల్సన్‌ రాబర్ట్‌, నేమలిపురి రఘు, బొడ్డు శ్రావణ్‌ ఉన్నారు.
స్నేహితుడి కుటుంబానికి సాయం
గీసుగొండ/నర్సంపేట: గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని మొగిలిచర్ల గ్రామానికి చెందిన గనిపాక దయాకర్‌ కరోనా మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని 1997-96 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు పరామర్శించారు. ఈ సందర్భంగా రూ. 26 వేల ఆర్థిక సాయంతోపాటు 25 కేజీల బియ్యాన్ని అందించారు. డీసీసీబీ డైరెక్టర్‌ దొంగల రమేశ్‌, కార్పొరేటర్‌ ఆకులపల్లి మనోహర్‌ మాట్లాడుతూ తోటి స్నేహితుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. అతడి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో అప్పని సురి, వనపర్తి రాజు, అంకతి రాజు, ప్రమోద్‌, అశోక్‌, విజయ్‌, రాజు, శ్రవణ్‌, స్వామి, ప్రదీప్‌ పాల్గొన్నారు. అలాగే, నర్సంపేట మండలం గురిజాలలో శంకర్‌ మృతి చెందగా, అతడి కుటుంబానికి క్వింటాల్‌ బియ్యం అందించారు. కార్యక్రమంలో శంకర్‌ స్నేహితులు న్యాయవాది మోటూరి రవి, దూడెల ప్రకాశ్‌, పత్రి కుమారస్వామి, చిన్నపెల్లి నర్సింగం, కడగండ్ల నర్సయ్య, పత్రి రజని, అశోక్‌, జమాండ్ల రాజేందర్‌, కుల పెద్దలు జెకమ్మల సాంబయ్య, పంజా లక్ష్మీనారాయణ, యశోద నర్సింగం, యశోద సారంగపాణి, జెకమల్ల రవి, పత్రి నవీన్‌, కున్నామల్ల సంపత్‌, బక్కి రాజు పాల్గొన్నారు.
కాంట్రాక్ట్‌ అధ్యాపకుల దాతృత్వం..
ఖానాపురం: మండలకేంద్రానికి చెందిన కాంట్రాక్ట్‌ అధ్యాపకుడు మర్రి రమేశ్‌ ఇటీవల కరోనాతో మృతి చెందగా, అతడి కుటుంబానికి తోటి కాంట్రాక్ట్‌ అధ్యాపక మిత్రులు, పూర్వ విద్యార్థులు రూ. 1,42,500 ఆర్థిక సాయం అందించారు. ఇందులో అధ్యాపకులు రూ. లక్ష అందించగా, పూర్వ విద్యార్థులు రూ. 42,500 అందజేశారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్‌ అధ్యాపకులు మల్లేశ్‌చంద్ర, సారంగపాణి, రఫీ, విజయ్‌, శ్రీనివాస్‌, సదానందం, కానిస్టేబుల్‌ కన్నె రాజు, పూర్వ విద్యార్థులు అశోక్‌, నరేశ్‌, మహేశ్‌ పాల్గొన్నారు.
గురువుకు బాసటగా శిష్యులు
పర్వతగిరి: లాక్‌డౌన్‌ కారణంగా తమకు చదువు చెప్పిన గురువు పరిస్థితి దయనీయంగా మారడంతో చలించిన శిష్యులు బాసటగా నిలిచి తమ గురుభక్తిని చాటుకున్నారు. ఏనుగల్లు గ్రామానికి చెందిన శంకపెల్లి అనిల్‌కుమార్‌ ప్రైవేట్‌ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అతడికి 2010 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు 50 కేజీల బియ్యం, రూ. 4 వేలు, రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ నల్లపు కుమార్‌, విద్యార్థులు రజినీకాంత్‌రావు, వినోద, ప్రశాంత్‌, రాజు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మేమున్నామంటూ..
మేమున్నామంటూ..
మేమున్నామంటూ..

ట్రెండింగ్‌

Advertisement