e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిల్లాలు ప్రజలను కాపాడుకునేందుకే లాక్‌డౌన్‌

ప్రజలను కాపాడుకునేందుకే లాక్‌డౌన్‌

ప్రజలను కాపాడుకునేందుకే లాక్‌డౌన్‌

జిల్లాల వారీగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు
కరోనా లక్షణాలున్న వారందరికీ పరీక్షలు చేయాలి
గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌
కొవిడ్‌ నియంత్రణ, ధాన్యం కొనుగోళ్లపై ములుగు, భూపాలపల్లి అధికారులతో సమీక్ష

భూపాలపల్లి రూరల్‌/ములుగు టౌన్‌, మే 12: కరో నా నుంచి ప్రజలను కాపాడుకునేందుకే సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌ను ప్రకటించారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. బుధవారం భూపాలపల్లి మంజూర్‌నగర్‌లోని సింగరేణి ఇల్లందు క్లబ్‌ హౌస్‌, ములుగు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో కొవిడ్‌ నియంత్రణ, ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, భూపాలపల్లి, ములుగు జడ్పీ చైర్మన్లు జక్కు శ్రీహర్షిణి, కుసుమ జగదీశ్వర్‌, కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించి మందులు అందజేయాలన్నారు. బాధితుల్లో మనో ధైర్యాన్ని నింపాలని కోరారు. వెంటిలేటర్‌ అవసరం ఉన్న వారిని ఎక్కువ మానిటరింగ్‌ చేయాలని సూచించారు. పాజిటివ్‌ వచ్చిన వారిని క్వారంటైన్‌ చేయడానికి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

రాష్ర్టానికి ఎక్కువ వ్యాక్సిన్‌ తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహక రించి విజయంతం చేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌ జిల్లాల వారీగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేశా రని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తారని అన్నారు. వ్యవసాయ పనులు ఆగవద్దని, ధాన్యం కొను గోలు చేయాలని అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినో త్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి, కరోనా కట్టడికి కోసం పనిచేసిన వారికి బహుమతులు అందజే శారు. ఎంపీ పసునూరి దయాకర్‌ మాట్లాడుతూ ప్రజల కు పూర్తి స్థాయి వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అన్నారు. కరోనాపై ప్రజ లకు పూర్తి అవగాహన కల్పించాలని, లాక్‌డౌన్‌ నిబంధన లను తప్పకుండా పాటించేలా చూడాలని అన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీ హర్షిణి మాట్లాడుతూ కరోనా సోకిన వారు హోం ఐసొలేషన్‌ కేంద్రాలను వినియోగించు కోవాలని అన్నారు. భయపడకుండా మనోధైర్యంతో ఉండాలని, యోగా చేయాలని సూచించారు.
ప్రతి మండలంలో క్వారంటైన్‌ సెంటర్లు

  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
    ప్రతి మండలంలో క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్య గండ్ర అన్నారు. వ్యా క్సినేషన్‌, కరోనా టెస్ట్‌లను వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహిం చాలని పేర్కొన్నారు. సింగరేణి ఏరియా దవాఖానలో సంస్థ ఉద్యోగులతోపాటు జిల్లా ప్రజలకు కూడా చికిత్స అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు కరోనా నివారణ చర్యలను జిల్లాలో అధికారులు సమర్థవంతంగా కొనసాగించాలని అధికారులను ఆదేశిం చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వైవీ గణేశ్‌, ఆద ర్శ్‌సురభి, ఐటీడీఏ పీవో హన్మంతు కే జండగే, భూపా లపల్లి డీఎంహెచ్‌వో సుధార్‌సింగ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, రైతు స మన్వయ సమితి ములుగు జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చ య్య, పీఎస్‌సీఎస్‌ చైర్మన్‌ మేకల సంపత్‌, వైద్య, పోలీస్‌ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
    గిరిజన భవన్‌ను సందర్శించిన మంత్రి
    ములుగు రూరల్‌: మండలంలోని బండారుపల్లి గ్రా మ సమీపంలో నిర్మించిన నూతన గిరిజన భవన్‌లో ఏ ర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌ను మంత్రి సత్యవతి రాథోడ్‌ సందర్శించారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులను, రోగులకు అందించే మెనూ, తదితర సౌకర్యాలను ఆమె కలెక్టర్‌తోపాటు ఐటీడీఏ పీవోను అడిగి తెలుసుకున్నారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రజలను కాపాడుకునేందుకే లాక్‌డౌన్‌

ట్రెండింగ్‌

Advertisement