e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News ప్రతి గ్రామాన్ని మోడల్‌గా తీర్చిదిద్దాలి

ప్రతి గ్రామాన్ని మోడల్‌గా తీర్చిదిద్దాలి

ప్రతి గ్రామాన్ని మోడల్‌గా తీర్చిదిద్దాలి

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట, ఏప్రిల్‌ 1 : ప్రతి గ్రామాన్ని మోడల్‌ విలేజ్‌గా తీర్చిద్దాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సూచించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలన్నారు. ముందు చూపుతో రానున్న 20 ఏళ్లకు సరిపడా పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాలకు వచ్చే నిధులను వృథాగా ఖర్చు చేయవద్దన్నారు. వాటిని ప్రాధాన్యతా క్రమంలో ఖర్చు చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేసేలా ప్లాన్‌ చేయాలన్నారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో మౌలిక అవసరాలను వేర్వేరుగా గుర్తించి, వాటిని ఒక ప్రణాళికతో మోడల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో ప్రణాళికలు రూపొందించాలన్నారు. నియోజకవర్గంలో దాదాపు రూ.60కోట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో అన్ని వర్గాలకూ ఉపయోగపడేలా కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గ్రామానికి దగ్గరలో ఉన్న చెరువులను సుందరీకరించాలని సూచించారు. ప్రతి గ్రామంలో బస్‌స్టాప్‌లు ఏర్పాటు చేయాలని, ప్రవేశ మార్గాల వద్ద ఆర్చీలు, పూల మొక్కలు పెట్టాలన్నారు. అలాగే, యువత క్రీడల కోసం మైదానాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీఎల్‌పీవో వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్‌ డీఈలు ఇజ్జగిరి, అజయ్‌, ఏఈలు, ఎంపీడీవోలు, ఎంపీఈవోలు పాల్గొన్నారు.

ఇవి కూడా చుడండి

ఢిల్లీ దవాఖానలో వైద్య అద్భుతం.. 30 ఏండ్ల తర్వాత నోరు తెరిచిన మహిళ

బ్లూ టీ గురించి మీకు తెలుసా..? దాంతో క‌లిగే లాభాలివే..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రతి గ్రామాన్ని మోడల్‌గా తీర్చిదిద్దాలి

ట్రెండింగ్‌

Advertisement