e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జిల్లాలు కష్టకాలంలో పేదలకు బాసట

కష్టకాలంలో పేదలకు బాసట

కష్టకాలంలో పేదలకు బాసట

రెండు నెలలు ఉచిత రేషన్‌ బియ్యం అందించేందుకు ప్రభుత్వ నిర్ణయం
ఒక్కొక్క లబ్ధిదారుడికి 15 కిలోలు
దుకాణాలకు చేరుతున్న రైస్‌
రెండు, మూడు రోజుల్లో పంపిణీ

హన్మకొండ, మే 31: కరోనా కష్టకాలంలో తెలంగాణ సర్కారు పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. జూన్‌, జూలై రెండు నెలలపాటు ఒక్కొక్క లబ్ధిదారుడికి ఉచి తంగా 15 కిలోల రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణ యించింది. ఇందుకు సంబంధించి జూన్‌ నెలకు కోటాను కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తు న్నారు. ఆయా రేషన్‌ షాపులకు బియ్యం చేరుతున్నాయి. జిల్లా కలెక్టర్‌ అనుమతి తీసుకున్న అనంతరం రెండు మూ డు రోజుల్లో బియ్యం పంపిణీ చేయనున్నారు.
అర్బన్‌ జిల్లాలో 2,66,131 మందికి..
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 2,66,131 మంది కార్డుదా రులు ఉన్నారు. వీరిలో ఆహార భద్రత, అంత్యోదయ, అన్న పూర్ణ కార్డుదారులున్నారు. వీరికి జిల్లాలోని 11 మండలా ల పరిధిలో ఉన్న 459 రేషన్‌ షాపుల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యం లో ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నది. ఈ నేపథ్యం లో ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున కార్డులో ఎందరుంటే అందరికి పంపిణీ చేస్తారు. గత మార్చిలో లాక్‌డౌన్‌ విధించ డంతో పేదలను ఆదుకునేందుకు ప్రభు త్వం ఒక్కొక్కరికి 12 కిలోల ఉచిత బియ్యంతోపాటు నిత్యా వసర వస్తువుల కోసం మూడు నెలల పాటు రూ.1500 కార్డుదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఆ తర్వాత నవంబర్‌ నెల వరకు 10 కిలోల ఉచిత బియ్యంను కొనసాగించింది. కరోనా సెకండ్‌ వేవ్‌ సందర్భం గా లాక్‌డౌన్‌ విధించడంతో నిరుపేదలు ఆకలికి అలమటించొద్దనే ఉద్దేశంతో ఒక్కొక్క రికి 15 కిలోల బియ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతి నెల ఇచ్చే 6 కిలోల బియ్యంతోపాటు అదనంగా 9 కిలోలు ఉచితంగా రెండు నెలలు అందజేయనున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కష్టకాలంలో పేదలకు బాసట

ట్రెండింగ్‌

Advertisement